సిరిసిల్ల విద్యార్థులకు కేటీఆర్ గిఫ్ట్
దాదాపు ఐదేళ్ల క్రితం తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కేటీఆర్. ఇందులో భాగంగా అవసరమున్న వారికి సాయం చేయడం లాంటి కార్యక్రమాలు చేశారు.

సొంత నియోజకవర్గం సిరిసిల్ల పరిధిలో పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు కానుక ఇవ్వాలని నిర్ణయించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని దాదాపు 3 వేల మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్‌తో పాటు ఓ పెన్నుల ప్యాకెట్‌ను అందిస్తానని ప్రకటించారు. ఇది చిన్న ప్రయత్నమైనప్పటికీ.. తనకు తృప్తినిచ్చే విషయమంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.
Small gesture may be, but something that made me
— KTR (@KTRBRS) February 26, 2024
Sent these to the 3 thousand youngsters of 10th grade in my constituency appearing for their board exams
Wishing them all the best pic.twitter.com/T0M7brk9zm
దాదాపు ఐదేళ్ల క్రితం తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కేటీఆర్. ఇందులో భాగంగా అవసరమున్న వారికి సాయం చేయడం లాంటి కార్యక్రమాలు చేశారు. పలు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం కింద అంబులెన్సులు అందించారు.
విద్యార్థులకు లాప్‌టాప్స్, దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు అమర్చడం, అనాథాశ్రమాలకు అవసరమైన సామగ్రి, వందలాది మంది దివ్యాంగులకు త్రీ-వీలర్ స్కూటర్స్ అందించారు. ఇక అవసరమైన వారికి వైద్య సహాయం, ఉన్నత విద్య చదువుకోవాలనుకుంటున్న పలువురు విద్యార్థులకు ఆర్థికసాయం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికీ కేటీఆర్ కొనసాగిస్తున్నారు.