ఇల్లు కొనాలనుకునేవారికి శుభవార్త - కేటీఆర్
హౌసింగ్ ఫర్ ఆల్ అంటే అందరికీ డబుల్ బెడ్రూం కట్టించడం కాదన్న కేటీఆర్.. లోన్ తీసుకుని ఇల్లు కొనుగోలు చేసే వారికి వడ్డీ రాయితీ కల్పిస్తామన్నారు.
ఇల్లు కొనాలనుకుంటున్న మధ్య తరగతి కుటుంబాలకు గుడ్‌న్యూస్ చెప్పారు కేటీఆర్. హైదరాబాద్ HICC లో నిర్వహించిన రియల్ ఎస్టేట్ సమ్మిట్- 2023కు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ఇల్లు కొనాలనుకుంటున్న మధ్య తరగతి కుటుంబాలకు వడ్డీ రాయితీ కల్పించే కొత్త పథకంపై ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.
కేటీఆర్ ఏం చెప్పారంటే..
తెలంగాణలో సొంతిల్లు లేని కుటుంబం ఉండకూడదు అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ నినాదం తీసుకొస్తున్నామని, దాన్ని సాకారం చేసి చూపెడతామన్నారు. అదే విధంగా తెలంగాణలో వంద శాతం అక్షరాస్యత సాధించాలని టార్గెట్‌గా పెట్టుకున్నామన్నారు.
BRS thinking of interest subvention scheme for home loans to benefit middle class buyers who want to buy 1200-1500sft houses, to ensure Housing for all - KTR
— Naveena (@TheNaveena) November 24, 2023
Govt to assist in paying interests
This is apart from 2BHK housing scheme, Gruha Lakshmi pic.twitter.com/Bci64Pfacr
హౌసింగ్ ఫర్ ఆల్ అంటే అందరికీ డబుల్ బెడ్రూం కట్టించడం కాదన్న కేటీఆర్.. లోన్ తీసుకుని ఇల్లు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ కల్పిస్తామన్నారు. దీంతో పాటు డబుల్ బెడ్రూం, గృహలక్ష్మి పథకాలు అమలు చేస్తామన్నారు. గృహలక్ష్మి పథకం కింద స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది.
♦