Telugu Global
Telangana

హీరోయిన్ల ఫోన్‌ ట్యాపింగ్‌.. కేటీఆర్‌ ఏమన్నారంటే!

తెలంగాణ ఉద్యమంలో ఫోన్ ట్యాపింగ్ చేసింది ఇప్పుడున్న అధికారులే. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మా ఫోన్‌లు ట్యాప్‌ చేశారని.. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డే స్వయంగా చెప్పారు

హీరోయిన్ల ఫోన్‌ ట్యాపింగ్‌.. కేటీఆర్‌ ఏమన్నారంటే!
X

హీరోయిన్ల ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ క్లారిటీ ఇచ్చారు. అలాంటి ఇల్లీగల్ పనులు చేయాల్సిన కర్మ తనకు పట్టలేదన్నారు. "లీకువీరుడు రేవంత్‌రెడ్డికి దమ్ముంటే 2004లో మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా. అప్పటి నుండి ఫోన్ ట్యాపింగ్‌ మీద ఆధారాలు తీయాలి. అప్పుడు ఎవరి బొక్కలు ఏంటో తెలుస్తాయి. 2011 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్‌ ఆధారాలు అన్ని బయటపెట్టాలి. తెలంగాణ ఉద్యమంలో ఫోన్ ట్యాపింగ్ చేసింది ఇప్పుడున్న అధికారులే. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మా ఫోన్‌లు ట్యాప్‌ చేశారని.. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డే స్వయంగా చెప్పారు".

"అధికారులు మారలేదు.. ప్రభుత్వం మారింది. ఇప్పటి ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి ఆరోజు మా ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీ. ఇప్పటి టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్‌రెడ్డి ఆరోజు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీ, తర్వాత మా ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీ, హైదరాబాద్ సీపీ. ప్రస్తుత డీజీపీ రవి గుప్తా ఆరోజు హోం సెక్రటరీ. వీళ్లంతా ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నారు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్‌ జరిగితే ఈ అధికారులకు తెలియదా?". ఓవైపు రైతులు చస్తుంటే, జనం మంచినీటికోసం అల్లాడుతుంటే రేవంత్‌ రెడ్డి మాత్రం పనికిమాలిన పనులు చేస్తూ టైమ్‌ పాస్ చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్.

First Published:  3 April 2024 12:02 PM IST
Next Story