Telugu Global
Telangana

కాళ్లు మొక్కినా రానివ్వం.. పార్టీ మారిన నేతలపై కేటీఆర్‌

తాండూరు అసెంబ్లీ సీటు ఏకపక్షంగా గెలుస్తామని బలంగా అనుకున్నామన్నారు కేటీఆర్. కానీ, ఏం జరిగిందో తెలియదని.. కొన్నిచోట్ల ఓడిపోయామన్నారు. పట్నం మహేందర్ రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.

కాళ్లు మొక్కినా రానివ్వం.. పార్టీ మారిన నేతలపై కేటీఆర్‌
X

పార్టీ మారుతున్న నేతలపై షాకింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. కేకే, కడియం లాంటి నాయకులు పార్టీ కష్ట కాలంలో వదిలిపెట్టి వెళ్తున్నారని, పోయే నాయకులు వెళ్లేటప్పుడు కొన్ని రాళ్లు వేసి వెళ్తారని, అలాంటి వాళ్లు చేస్తున్న విమర్శలను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు కేటీఆర్.

పార్టీ కోసం, కార్యకర్తల కోసం తానే స్వయంగా వస్తానని చెప్పారు కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుంటానన్నారు. 2014లో విశ్వేశ్వర్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఎంపీగా చేశామని, ఆ తర్వాత 2019లో రంజిత్ రెడ్డిని కూడా ఎంపీ చేశామని కేటీఆర్ గుర్తుచేశారు. కవిత అరెస్ట్ అయిన రోజే రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి నవ్వుకుంటూ కాంగ్రెస్‌లోకి వెళ్లారన్నారు కేటీఆర్‌. అలాంటి నేతలు మళ్లీ వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్న పార్టీలోకి రానీయమంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.


తాండూరు అసెంబ్లీ సీటు ఏకపక్షంగా గెలుస్తామని బలంగా అనుకున్నామన్నారు కేటీఆర్. కానీ, ఏం జరిగిందో తెలియదని.. కొన్నిచోట్ల ఓడిపోయామన్నారు. పట్నం మహేందర్ రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిన తర్వాత రంజిత్‌ రెడ్డి మొదటగా ఫోన్ చేశారని.. అగ్రెసివ్‌గా ముందుకు వెళ్దామని తనతో చెప్పారని గుర్తు చేసుకున్నారు కేటీఆర్. మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఆస్కార్‌ లెవల్‌లో పర్ఫార్మెన్స్ ఇచ్చారన్నారు కేటీఆర్.

First Published:  29 March 2024 6:50 PM IST
Next Story