Telugu Global
Telangana

నాది తప్పయితే చంచల్‌గూడ జైలు.. మరి నీది తప్పయితే..?

బ‌డే భాయ్.. చోటే భాయ్ క‌న్నుస‌న్నల్లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌ని చేయ‌క‌పోతే.. తామిచ్చిన‌ 27 ఫిర్యాదుల‌పై స్పందించాలన్నారు కేటీఆర్.

నాది తప్పయితే చంచల్‌గూడ జైలు.. మరి నీది తప్పయితే..?
X

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి ఫేక్‌ ప్రచారాలు చేయడం దారుణమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓయూలో కరెంట్ కోతలు, నీటి కొరత అంశంపై స్వయానా సీఎం రేవంత్‌ రెడ్డే ఫేక్ సర్క్యూలర్ పోస్ట్ చేశారన్నారు. గతేడాది కూడా కరెంట్ కోతలు, నీటి సమస్య ఉందని ఆ సర్క్యూలర్‌లో ఉందని.. కానీ అది ఫేక్ అన్నారు. ఒరిజినల్‌ సర్క్యూలర్‌ను ఆధారాలతో స‌హా మీడియాకు చూపించారు కేటీఆర్.

సీఎం ఫేక్ సర్క్యూలర్

ఫేక్ సర్క్యూలర్ సీఎం రేవంత్‌ రెడ్డి పెట్టి.. అది ఫేక్ అని బయటపెట్టిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్‌ను అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. తాను చూపించిన ఏ ఒక్క ఆధారం తప్పని నిరూపించినా చంచల్‌గూడ జైలుకు వెళ్లేందుకు సిద్ధమని.. అలాగే నకిలీ సర్క్యూలర్ సృష్టించినందుకు రేవంత్ రెడ్డి కూడా చంచల్‌గూడ జైలుకు వెళ్లేందుకు సిద్ధమా అని కేటీఆర్ సవాల్ విసిరారు. క్రిషాంక్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అందుకే కేసీఆర్‌పై కుట్ర..

బ‌డే భాయ్.. చోటే భాయ్ క‌న్నుస‌న్నల్లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌ని చేయ‌క‌పోతే.. తామిచ్చిన‌ 27 ఫిర్యాదుల‌పై స్పందించాలన్నారు కేటీఆర్. రేవంత్ మీద 8, మిగ‌తా పార్టీ నాయ‌కుల మీద మ‌రో 19 ఫిర్యాదులు ఈసీకి ఇచ్చామన్నారు. ఒక్కటంటే ఒక్కదాని మీద కూడా చ‌ర్య లేదన్నారు. కొండా సురేఖ‌కు మంద‌లింపు త‌ప్ప.. వారి ప్రచారాన్ని నిషేధించ‌లేదన్నారు. కేసీఆర్ బ‌స్సు యాత్ర ప్రారంభించ‌గానే కాంగ్రెస్‌కు, బీజేపీకి ద‌డ పుట్టిందన్నారు కేటీఆర్. 2014లో బ‌డే భాయ్, 2023లో చోటే భాయ్ చేసిన మోసాల్ని ప్రజ‌ల‌కు చెప్తుంటే త‌ట్టుకోలేక ప్రజ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకు కుట్రకు తెరలేపారన్నారు.

First Published:  2 May 2024 1:45 PM GMT
Next Story