Telugu Global
Telangana

MLC ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు

ఎమ్మెల్సీ ఉపఎన్నిక కోసం మార్చి 28న పోలింగ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు జరగడంతో ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపును ఇప్పటివరకూ పెండింగులో ఉంచారు.

MLC ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు
X

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల MLC ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌ కుమార్ రెడ్డి ఘనవిజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై దాదాపు 108 ఓట్ల తేడాతో నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఇక స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్‌కు ఒక ఓటు వచ్చింది. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం తేలిపోయింది.


గతంలో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన కసిరెడ్డి నారాయణ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.

ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కోసం మార్చి 28న పోలింగ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు జరగడంతో ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపును ఇప్పటివరకూ పెండింగులో ఉంచారు. శనివారం చివర విడత పోలింగ్ ముగియడంతో ఇవాళ లెక్కింపు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో.. బీఆర్ఎస్ తన సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడం ఆ పార్టీకి కొంత ఊరట కలిగించే విషయం.

First Published:  2 Jun 2024 5:53 AM GMT
Next Story