Telugu Global
Telangana

పీసీసీ అంటే పేమెంట్స్ కలెక్షన్ సెంటర్

టీపీసీసీకి తనదైన శైలిలో నిర్వచనమిచ్చారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ.. పేమెంట్స్ కలెక్షన్ సెంటర్ గా మారిందని చెప్పారు. ప్రదేశ్ కాంగ్రెస్ అంటే ప్రదేశ్ క్రిమినల్స్ సెంటర్ అని అన్నారు.

పీసీసీ అంటే పేమెంట్స్ కలెక్షన్ సెంటర్
X

సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు ఘాటుగా బదులిస్తున్నారు. రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కి పొగరుతో మాట్లాడ్తున్నారని మండిపడ్డారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తండ్రి వయసులో ఉండే కేసీఆర్ పై మాట్లాడే స్థాయి రేవంత్ కి లేదన్నారు. గద్దర్ మరణాన్ని రాజకీయం చేసే రేవంత్ ఎత్తుగడలు పారలేదని, అందుకే కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. గద్దర్ అందరివాడు అని, అన్ని పార్టీలతో ఉద్యమంలో పాల్గొన్నాడని చెప్పారు. గద్దర్ పై కాల్పులకు చంద్రబాబు కారణం కాదా..? అని ప్రశ్నించారు. గద్దర్ జై తెలంగాణ అనగానే కాల్పులు జరిగాయని, కాంగ్రెస్ హయాంలో నక్సలైట్లను చర్చలకు పిలిచి తర్వాత వేల మందిని పొట్టన పెట్టుకున్నారని విమర్శించారు శ్రీనివాస్ గౌడ్.


టీపీసీసీకి తనదైన శైలిలో నిర్వచనమిచ్చారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ.. పేమెంట్స్ కలెక్షన్ సెంటర్ గా మారిందని చెప్పారు. ప్రదేశ్ కాంగ్రెస్ అంటే ప్రదేశ్ క్రిమినల్స్ సెంటర్ అని అన్నారు. కాంగ్రెస్ లో హేమాహేమీలున్నారని, కానీ వారంతా రేవంత్ రెడ్డిని ఎలా భరిస్తున్నారంటూ సానుభూతి తెలిపారు. రేవంత్ కి కాంగ్రెస్ కార్యకర్తలే పిండం పెట్టే రోజు దగ్గర్లో ఉందన్నారు. మోదీని ఒక్క మాట అంటేనే రాహుల్ కు కోర్టు శిక్ష విధించిందని, రేవంత్ అనే చిల్లర మాటలకు కోర్టు ఎన్ని సార్లు శిక్షలు వేయాలో అని అన్నారు శ్రీనివాస్ గౌడ్.

కేసీఆర్ తెలంగాణ బీద వర్గాలకు దేవుడని కొనియాడారు శ్రీనివాస్ గౌడ్. తెలంగాణలో అల్లకల్లోలం సృష్టించాలని కాంగ్రెస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా, ట్రిక్కులు చేసినా 100 సీట్లతో బీఆర్ఎస్ మళ్ళీ అధికారం లోకి రావడం ఖాయమని చెప్పారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని, తెలంగాణ మరింత అభివృద్ధి చెందటం ఖాయమని అన్నారు. కేసీఆర్ తో రేవంత్ రెడ్డికి పోలికేంటని ప్రశ్నించారు.

First Published:  10 Aug 2023 6:58 AM IST
Next Story