రైతు భరోసాపై బీఆర్‌ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
తెలంగాణలో రైతు భరోసా వచ్చే సీజన్‌లో నుంచి ఇస్తామన్న మంత్రి తుమ్మల వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు
తెలంగాణలో రైతు భరోసా వచ్చే సీజన్‌లో నుంచి ఇస్తామన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. రైతు భరోసాపై రేవంత్ ప్రభుత్వం మాట మార్చడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి శ్రేణులు ఆందోళనకు దిగాయి.పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇచ్చిన మాట మేరకు తక్షణం రైతు భరోసా అమలు చేయాలని గులాబీ శ్రేణులు డిమాండ్ చేశారు. మహేశ్వరంలో రైతు భరోసా వెంటనే అమలు చేయాలని కేటీఆర్ పిలుపు మేరకు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలమేరకు మహేశ్వరం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట తెలంగాణ తల్లి విగ్రహం వద్ద.. రైతు భరోసా ఎగవేతను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.