టికెట్లు దక్కని సిట్టింగ్ లు వీరే..
కోరుట్లలో ప్రస్తుత ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కొడుకు డాక్టర్ సంజయ్ కి టికెట్ ఇచ్చారు. అక్కడ సిట్టింగ్ కి సీటు దక్కకపోయినా ఆ కుటుంబానికే కేసీఆర్ టికెట్ ఇచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో సాయన్న మృతితో ఆయన కుమార్తె లాస్యకు టికెట్ కేటాయించారు.
తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలకు గాను 115 చోట్ల అభ్యర్థులను ఖరారు చేశారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేశారు. మొత్తం 9 చోట్ల సిట్టింగ్ లకు ఛాన్స్ రాలేదు. అందులో ఎనిమిది చోట్ల కొత్తవారికి అవకాశమివ్వగా, ఒక్క నియోజకవర్గంలో మాత్రం ఆ ఎమ్మెల్యే వారసుడికే టికెట్ ప్రకటించారు సీఎం కేసీఆర్.
టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు..
ఉప్పల్ - భేతి సుభాష్ రెడ్డి ( బండారు లక్ష్మారెడ్డి ఇక్కడ పోటీ చేస్తారు )
బోథ్ - రాథోడ్ బాపూరావు (అనిల్ జాదవ్)
ఖానాపూర్ - రేఖా నాయక్ (భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్)
అసిఫాబాద్ - ఆత్రం సక్కు (కోవా లక్ష్మి)
వైరా - రాములు నాయక్ (బానోతు మదన్ లాల్)
కామారెడ్డి - గంప గోవర్ధన్ (కేసీఆర్)
స్టేషన్ ఘన్ పూర్ - రాజయ్య (కడియం శ్రీహరి )
వేములవాడ - చెన్నమనేని రమేష్ (చెల్మెడ లక్ష్మీనరసింహారావు)
కోరుట్లలో ప్రస్తుత ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కొడుకు డాక్టర్ సంజయ్ కి టికెట్ ఇచ్చారు. అక్కడ సిట్టింగ్ కి సీటు దక్కకపోయినా ఆ కుటుంబానికే కేసీఆర్ టికెట్ ఇచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో సాయన్న మృతితో ఆయన కుమార్తె లాస్యకు టికెట్ కేటాయించారు. నర్సాపూర్, నాంపల్లి, జనగామ, గోషామహల్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. టికెట్లు కోల్పోయిన కొంతమంది ఎమ్మెల్యేలను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టినా.. ఆసిఫా బాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుని ఆదిలాబాద్ లోక్ సభ నుంచి బరిలో దింపేందుకు ప్రస్తుతం లిస్ట్ లో చేర్చలేదు. కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్దన్ కోరడం వల్లే తాను అక్కడినుంచి పోటీ చేస్తున్నట్టు తెలిపారు కేసీఆర్. అంటే ఆయనకు కూడా కచ్చితంగా ప్రత్యామ్నాయం ఆలోచించి ఉంటారు. టికెట్లు రాని ఆశావహులెవరూ నిరాశపడొద్దని, అవకాశాలు ఉన్నాయని అందరికీ భరోసా ఇచ్చారు కేసీఆర్.