Telugu Global
Telangana

తెలంగాణలో బీఆర్ఎస్‌ను నిషేధించాలి

అది విధ్వంసకర పార్టీ : కేంద్ర మంత్రి బండి సంజయ్‌

తెలంగాణలో బీఆర్ఎస్‌ను నిషేధించాలి
X

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీని నిషేధించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. అది విధ్వంసకర పార్టీ అని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌, సీఎం రేవంత్‌ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్‌ పై దాడికి కేటీఆర్‌ సూత్రధారి అని తేలినా అరెస్ట్‌ చేయకపోవడం సిగ్గు చేటు అన్నారు. కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డి కుటుంబాల మధ్య వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపించారు. తనతో రేవంత్‌ కు వ్యాపార సంబంధాలున్నాయని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ చేశారు. తెలంగాణలో ఆర్‌కే బ్రదర్స్‌ పాలన నడుస్తుందన్నారు. గ్రూప్‌ -1, కానిస్టేబుళ్ల ఆందోళననూ బీఆర్‌ఎస్‌ విధ్వంసం సృష్టించాలని అనుకుందన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నానని, పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేవన్నారు.

First Published:  17 Nov 2024 1:58 PM IST
Next Story