Telugu Global
Telangana

అది స్కాంగ్రెస్.. ఆయన పర్యటన బోగస్

సీఎం కార్యాలయం అధికారికంగా ప్రకటించిన పెట్టుబడులు రూ. 5540 కోట్లు మాత్రమే. అయితే కాంగ్రెస్ నేతలు ఘనంగా వాటిని రూ. 31,532 కోట్లకు పెంచి ప్రచారం చేసుకుంటున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

అది స్కాంగ్రెస్.. ఆయన పర్యటన బోగస్
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా పర్యటన దాదాపుగా ముగిసింది. రేపు రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో పెట్టుబడులకోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ సీఎం సాధించిందేంటి, సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు చెబుతున్నదేంటి..? అంటూ బీఆర్ఎస్ నుంచి ఓ ట్వీట్ పడింది. వాస్తవాలు దాచిపెట్టి, ప్రజల్ని మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది.


తెలంగాణ సీఎంఓ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఎప్పటికప్పుడు అమెరికా, దక్షిణ కొరియా పర్యటన వివరాలు, వివిధ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలు, పెట్టుబడుల వివరాలు ప్రకటిస్తున్నారు. అలా సీఎం కార్యాలయం అధికారికంగా ప్రకటించిన పెట్టుబడులు రూ. 5540 కోట్లు మాత్రమే. అయితే కాంగ్రెస్ నేతలు ఘనంగా వాటిని రూ. 31,532 కోట్లకు పెంచి ప్రచారం చేసుకుంటున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రూ. 31,532 కోట్లు నిజంగానే పెట్టుబడుల రూపంలో తెలంగాణకు వస్తుంటే, ఏ కంపెనీ ఎన్ని కోట్లు పెడుతుందో లెక్కలు చెప్పాలి కదా అని లాజిక్ తీస్తుంది. రూ. 5540 కోట్లకు లెక్కలు చెప్పి.. రూ. 31,532 కోట్లు వచ్చాయని ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలు చెప్పిన రూ. 5540 కోట్లలో కూడా ఒకటి రేవంత్ బినామీ కంపెనీ అని, ఇంకొకటి ఒక ఫేక్ కంపెనీ అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అవి రెండు తీసేస్తే మిగిలింది రూ. 3720 కోట్లు మాత్రమేనని చెబుతున్నారు. ఈ పర్యటన సక్సెస్ అయినట్టు కాంగ్రెస్ ట్వీట్లు వేయడాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు చెప్పాలని నిలదీస్తున్నారు. ఆయా పెట్టుబడులు ఎక్కడి నుండి పట్టుకొచ్చారో తెలంగాణ ప్రజలకు వివరిస్తారా..? లేదా ఎప్పట్లాగే జనాలని మోసం చేస్తూ కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారా? అని ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు.

First Published:  13 Aug 2024 7:09 AM IST
Next Story