కాంగ్రెస్‌వి ఆరు కాదు.. 420 హామీలు - బీఆర్ఎస్
వందల కొద్ది హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కేవలం ఆరు హామీల మంత్రం జపిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది.
అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందని ఆరోపించింది భారత రాష్ట్ర సమితి. ఈ మేరకు కాంగ్రెస్ 420 హామీల పేరుతో ఓ బుక్లెట్ విడుదల చేసింది. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం మోసపూరితంగా ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని పేర్కొంది. వాటి అమలుపై ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో ఆ హామీలను మరొక్కసారి ప్రజలకు గుర్తు చేసేందుకు బుక్‌లెట్‌ను తయారు చేసినట్లు స్పష్టం చేసింది.
వందల కొద్ది హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కేవలం ఆరు హామీల మంత్రం జపిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు హామీలు కాదు.. 420 హామీలని స్పష్టం చేసింది బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోతో పాటు వివిధ డిక్లరేషన్ల పేరిట ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కచోట చేర్చి బుక్‌లెట్‌ను రూపొందించింది.
కాంగ్రెస్ మోసపూరిత హామీలపైన కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్లెట్ విడుదల చేసిన భారత రాష్ట్ర సమితి
— BRS Party (@BRSparty) January 3, 2024
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన అడ్డగోలు హామీలపైన భారత రాష్ట్ర సమితి ఒక బుక్లెట్ ని ప్రచురించింది.
కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం మోసపూరితంగా ఆచరణ సాధ్యం కానీ అనేక… pic.twitter.com/seLZEtTnNF
ఇప్పటికైనా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసేలా కార్యాచరణ ప్రారంభించాలని డిమాండ్ చేసింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ రాకముందే ఎన్నికల ప్రచారంలో తేదీలతో సహా చెప్పినట్లుగా మాటకు కట్టుబడి హామీలను నెరవేర్చాలని కోరింది. కాంగ్రెస్ చేసిన మోసపు హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తుచేస్తామని స్పష్టం చేసింది బీఆర్ఎస్.