Telugu Global
Telangana

'స్వేదపత్రం' రేపటికి వాయిదా..? కారణం ఏంటంటే..?

ఆరు గ్యారెంటీల అమలుని ఆలస్యం చేసేందుకే పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ శ్వేత పత్రాల ఎత్తుగడ వేస్తోందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. శ్వేత పత్రాలన్నీ బోగస్ అంటున్నారు. అందుకే వాటికి కౌంటర్ గా స్వేద పత్రాన్ని రెడీ చేశారు.

స్వేదపత్రం రేపటికి వాయిదా..? కారణం ఏంటంటే..?
X

కాంగ్రెస్ 'శ్వేత పత్రా'నికి ప్రతిగా బీఆర్ఎస్ 'స్వేదపత్రం' విడుదల రేపటికి వాయిదా పడింది. వాస్తవానికి ఈరోజు ఉదయం 11 గంటలకు స్వేద పత్రాన్ని విడుదల చేస్తామని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ప్రకటించారు. కానీ ఈరోజు అనూహ్యంగా కార్యక్రమం వాయిదా పడింది. రేపు(ఆదివారం) ఈ కార్యక్రమం ఉంటుందని, ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో 'స్వేదపత్రం' విడుదల చేస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి.

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వచ్చీ రాగానే గత ప్రభుత్వంపై నిందలు వేసేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వరుస నివేదికలు సిద్ధం చేసింది. శ్వేత పత్రాల రూపంలో వాటిని అసెంబ్లీలో విడుదల చేసింది. అయితే తమకు కూడా అసెంబ్లీ సమావేశాల్లో గణాంకాలు ప్రవేశ పెట్టే ఛాన్స్ ఇవ్వాలని. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కోరారు. అందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో.. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ప్రగతి నివేదికను విడుదల చేయడానికి ఆ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. దీనికి 'స్వేదపత్రం' అనే పేరు పెట్టారు. తెలంగాణ భవన్ లో స్వేద పత్రం విడుదల అని ప్రకటించారు.

రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బ తీస్తే సహించబోమని అంటున్నారు మాజీమంంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపిస్తే సహించేది లేదని చెప్పారు. అందుకే.. జరిగిన అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ ఇస్తామని చెప్పారు. అయితే వివిధ కారణాల వల్ల ఈరోజు విడుదల కావాల్సిన స్వేదపత్రం రేపటికి వాయిదా పడింది. ఆరు గ్యారెంటీల అమలుని ఆలస్యం చేసేందుకే పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ శ్వేత పత్రాల ఎత్తుగడ వేస్తోందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. శ్వేత పత్రాలన్నీ బోగస్ అంటున్నారు. అందుకే వాటికి కౌంటర్ గా స్వేద పత్రాన్ని రెడీ చేశారు.

First Published:  23 Dec 2023 12:31 PM IST
Next Story