సాయిచంద్, జగదీష్ కుటుంబాలకు ఆర్థిక సాయం..
వారి మరణం తర్వాత తక్కువ వ్యవధిలోనే ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు బీఆర్ఎస్ నేతలు. వారి కుటుంబాలకు అండగా నిలిచారు,
ఇటీవల మరణించిన బీఆర్ఎస్ నేతలు సాయిచంద్, కుసుమ జగదీష్ కుటుంబాలకు పార్టీ ఆర్థిక సాయం అందించింది. వారి మరణం తర్వాత తక్కువ వ్యవధిలోనే ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు నేతలు. వారి కుటుంబాలకు అండగా నిలిచారు, వారి భవిష్యత్ కి భరోసా ఇచ్చారు. వారిద్దరూ లేని లోటుని ఆ కుటుంబాలకు పార్టీ తీరుస్తుందని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా అమరచింతలో ప్రముఖ గాయకుడు, ఉద్యమకారుడు దివంగత సాయిచంద్ ఇంటికి వెళ్లి పార్టీ తరపున ఆయన తండ్రి వెంకట్రాములకు రూ.25 లక్షలు, సాయిచంద్ సోదరికి రూ.25 లక్షల చెక్కులను అందజేయడం జరిగింది.
— V Srinivas Goud (@VSrinivasGoud) August 28, 2023
దివంగత సాయి చంద్… pic.twitter.com/EUV1rW1H9V
గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న సాయిచంద్ జూన్ నెలలో గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భార్య రజినికి రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశమిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అంతే కాదు ఆ కుటుంబానికి కూడా అండగా ఉంటామని మాటిచ్చారు నేతలు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నేడు సాయిచంద్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. వనపర్తి జిల్లా అమరచింతలో సాయిచంద్ ఇంటికి వెళ్లి పార్టీ తరపున ఆయన తండ్రి వెంకట్రాములకు రూ.25 లక్షలు, సాయిచంద్ సోదరికి రూ.25 లక్షల చెక్కులను అందజేశారు. కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు.
ములుగు జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ కి.శే కుసుమ జగదీశ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ రూ.కోటి యాభై లక్షల సహాయం. pic.twitter.com/5FwrXzqQJo
— Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS) August 28, 2023
ములుగు జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కుటుంబానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక సాయం చేసింది. వారి కుటుంబ సభ్యులకు రూ. 1.5 కోట్ల ఆర్థిక సాయం అందించారు నేతలు. మంత్రి సత్యవతి రాథోడ్ సహా ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుసుమ జగదీష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చెక్ ని అందజేశారు.