బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్.. పెద్దపల్లి నుంచి ఎవరంటే.?
ఈ నెల 12న కరీంనగర్‌లో నిర్వహించనున్న బహిరంగ సభతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు కేసీఆర్. కరీంనగర్ సభ అనంతరం ఖమ్మంలో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. నాలుగు స్థానాలకు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించారు గులాబీ బాస్ కేసీఆర్. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లను ప్రకటించారు. ఇక ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల నుంచి మరోసారి సిట్టింగ్‌లకే అవకాశమిచ్చారు కేసీఆర్. ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు గారు
— BRS Party (@BRSparty) March 4, 2024
కరీంనగర్ - బి. వినోద్ కుమార్
పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్
ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు
మహబూబాబాద్ - మాలోత్ కవిత
గత రెండు రోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని… pic.twitter.com/nLYi1QXLz5
ఆదివారం కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలకు చెందిన కీలక నేతలతో సమావేశమయ్యారు కేసీఆర్. ఇవాళ ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని నేతలతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై నేతలతో చర్చించారు. నేతలతో చర్చించిన అనంతరం నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
ఈ నెల 12న కరీంనగర్‌లో నిర్వహించనున్న బహిరంగ సభతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు కేసీఆర్. కరీంనగర్ సభ అనంతరం ఖమ్మంలో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు బీజేపీ తెలంగాణలోని 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థిపై మాత్రమే స్పష్టతనిచ్చింది. వంశీచంద్ రెడ్డి పాలమూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఇటీవల జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.