ఈనెల 15న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
ఈనెల 15న సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరుగుతుంది. బీఆర్ఎస్ ఎంపీలంతా ఈ సమావేశానికి హాజరవుతారు.
ఈనెల 18నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈనెల 15న సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరుగుతుంది. బీఆర్ఎస్ ఎంపీలంతా ఈ సమావేశానికి హాజరవుతారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
— BRS Party (@BRSparty) September 11, 2023
ఈనెల 15న మధ్యాహ్నం ప్రగతి భవన్ లో, పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.
ఈనెల 18వ తేదీ నుండి.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. ఈ… pic.twitter.com/YmDvxYrZ3r
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వ్యవహారం ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారింది. అజెండా ఏంటనేది ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. పార్లమెంట్ నూతన భవనంలోకి మారే క్రమంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అదే సమయంలో జమిలి ఎన్నికల వ్యవహారం కూడా చర్చకు వస్తోంది. మహిళా బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశముందని అంటున్నారు. ఈ క్రమంలో ఎన్డీఏ వైరి వర్గాలు ఈ సమావేశాల్లో ఏవైపు మొగ్గుచూపుతాయనేది ఆసక్తిగా మారింది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో వివిధ పార్టీలన్నీ ఎంపీలతో మీటింగ్ లు పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సీఎం జగన్ కూడా ఈ వ్యవహారంపై దృష్టిసారించారు. ఆయన ఢిల్లీ పర్యటన కూడా ప్రత్యేక సమావేశాలతో ముడిపడి ఉంది అంటున్నారు. ఇటు బీఆర్ఎస్ కూడా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై చర్చించడానికి సమావేశమవుతోంది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. ఈ మీటింగ్ లో లోక్ సభ, రాజ్యసభ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.