Telugu Global
Telangana

శాసన మండలి ఆవరణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల నిరసన

క్వింటాల్‌ పసుపునకు రూ. 15 వేల మద్దతు ధర చెల్లించాలని డిమాండ్‌

శాసన మండలి ఆవరణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల నిరసన
X

శాసన మండలి ఆవరణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. క్వింటాల్‌ పసుపునకు రూ. 15 వేల మద్దతు ధర చెల్లించాలని నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మధుసూదనాచారీ మాట్లాడుతూ.. కేంద్రం పసుపు బోర్డు ప్రకటించింది కానీ చట్టబద్ధత లేదన్నారు. తక్షణమే పసుపు బోర్డుకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. పసుపునకు రూ. 9 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. రైతు సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ పోరాడుతుందన్నారు.

First Published:  15 March 2025 10:44 AM IST
Next Story