Telugu Global
Telangana

బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి కారు ప్ర‌మాదం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ న‌వీన్ కుమార్ రెడ్డికి భారీ ప్ర‌మాదం త‌ప్పింది. రోడ్డు ప్ర‌మాదం నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి  కారు ప్ర‌మాదం
X

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ న‌వీన్ కుమార్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. బెంగుళూరు హైవే మీద మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుంచి హైద‌రాబాద్‌కు గురువారం మ‌ధ్యాహ్నం బ‌య‌ల్దేరారు. షాద్‌న‌గ‌ర్ మిలినీయం టౌన్ షిప్ వ‌ద్ద స‌డెన్‌గా ఓ ద్విచ‌క్ర వాహ‌నం అడ్డుగా వ‌చ్చింది. దీంతో ఎమ్మెల్సీ కారు డ్రైవ‌ర్ స‌డెన్‌గా బ్రేక్ వేయ‌డంతో.. బైక్‌పై ఉన్న వ్య‌క్తికి గాయాల‌య్యాయి.

ఎమ్మెల్సీ న‌వీన్ కుమార్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ఇక గాయ‌ప‌డిన వ్య‌క్తిని త‌న కారులోనే ఎమ్మెల్సీ న‌వీన్ స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యుల‌ను ఎమ్మెల్సీ ఆదేశించారు. ఈ ప్ర‌మాదంలో న‌వీన్ కుమార్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు, పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన ఎమ్మెల్సీ వ్యక్తిని తన వాహనంలో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.

First Published:  21 Nov 2024 6:18 PM IST
Next Story