Telugu Global
Telangana

డిప్యూటీ సీఎం భట్టికి అవమానం.. కవిత ఏమన్నారంటే?

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిపూజలో సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం భట్టికి అవమానం.. కవిత ఏమన్నారంటే?
X

సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు అవమానం జరిగిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇది చాలా దౌర్భాగ్యమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కవిత. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు వినతిపత్రం ఇస్తే ఆనాడు కూడా దళితుడికి వినతిపత్రం ఇచ్చారు అని రేవంత్ అవమానించారన్నారు కవిత.

అసలేం జరిగిందంటే.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిపూజలో సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. సీఎం దంపతులతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రులకు ఆలయ పండితులు ఆశీర్వచనం అందించారు.


అయితే వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చే టైమ్‌లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పీటలపై ఆసీనులయ్యారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న భట్టి నేలపై కూర్చోవడం వివాదాస్పదమైంది. మరో పక్కన కొండా సురేఖకు తక్కువ ఎత్తులో ఉన్న పీటపై కూర్చున్నారు. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దళితుడు కావడం వల్లే ఆయనను నేలపై కూర్చొబెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. జాతీయ మీడియా సైతం ఈ అంశాన్ని హైలైట్ చేసింది.

First Published:  11 March 2024 4:34 PM IST
Next Story