Telugu Global
Telangana

ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. మూడు వారాల పాటు బెడ్ రెస్ట్

ఎమ్మెల్సీ కవిత కాలికి ఫ్రాక్చర్ అయినట్లు తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కవిత చేసిన పోస్ట్‌కు రిప్ల‌య్‌లు ఇస్తున్నారు.

ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. మూడు వారాల పాటు బెడ్ రెస్ట్
X

బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం అయింది. ఫ్రాక్చర్ అయినందువల్ల డాక్టర్ల సూచన మేరకు ఆమె మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 'నా కాలికి ఫ్రాక్చర్ అయ్యింది. మూడు వారాలపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఎలాంటి సాయం లేదా సమాచారం కోసమైనా నా ఆఫీసు అందుబాటులోనే ఉంటుంది' అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

ఎమ్మెల్సీ కవిత కాలికి ఫ్రాక్చర్ అయినట్లు తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కవిత చేసిన పోస్ట్‌కు రిప్ల‌య్‌లు ఇస్తున్నారు. కవిత కాలికి గాయం అయినట్లు తెలుసుకున్న మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కవిత త్వరగా, వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.

First Published:  11 April 2023 2:49 PM IST
Next Story