Telugu Global
Telangana

ప్రజ్వల్‌ రేవణ్ణపై కవిత కామెంట్స్‌

ఈడీ కేసులో ట్రయల్‌ కోర్టు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ ఇవాల్టితో ముగియటంతో, కవిత అభ్యర్థన మేరకు ఆమెను నేరుగా కోర్టు ముందు హాజరుపరిచారు.

ప్రజ్వల్‌ రేవణ్ణపై కవిత కామెంట్స్‌
X

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని వదిలేసి, దేశం దాటించి.. తన లాంటి వారిని అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలన్నారు. హౌస్‌ అవెన్యూ కోర్టుకు వచ్చిన సందర్భంగా కవిత ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన ఈడీ కేసులో BRS ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని వారం రోజులు పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈనెల 14 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది.

ఈడీ కేసులో ట్రయల్‌ కోర్టు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ ఇవాల్టితో ముగియటంతో, కవిత అభ్యర్థన మేరకు ఆమెను నేరుగా కోర్టు ముందు హాజరుపరిచారు. మరోసారి కస్టడీని పొడిగించాలన్న దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం, కవిత జ్యుడీషియల్ కస్టడీని మే 14వ తేదీ వరకు పొడిగించింది కోర్టు. ముగ్గురు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతిచ్చింది. మే 13న తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

మరోవైపు ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ సైతం కోర్టు పొడిగించింది. ఆయనకు ఈనెల 20 వరకు కస్టడీ పొడిగించింది. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలకు సింగిల్ ఫేజ్‌లో మే 25న పోలింగ్ జరగనుంది.

First Published:  7 May 2024 3:54 PM IST
Next Story