బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చర్చకు పట్టు.. సభ నుంచి వాకౌట్
శాసన సభ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.
BY Vamshi Kotas20 Dec 2024 2:56 PM IST
X
Vamshi Kotas Updated On: 20 Dec 2024 2:59 PM IST
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఫార్ములా-ఈ కేసుపై శాసన సభలో చర్చ జరపాలని బీఆర్‌ఎస్ సభ్యులు సభలో పట్టుబట్టారు. కానీ స్పీకర్ అనుమతించకపోవడంతో వారు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశం మీద అసెంబ్లీలో చర్చ జరపాలని వెల్ లోకి దూసుకొచ్చిన హరీష్ రావు, బీఆర్‌ఎస్ సభ్యులు ఇవాళ పట్టుబట్టారు.
ప్రపంచస్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచే లక్ష్యంతో హైదరాబాద్ నగరానికి ఫార్ములా ఈ కారు రేసింగ్‌ను కేటీఆర్ తీసుకొస్తే.. ఆయనపై అక్రమ కేసులు పెట్టడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఈ అంశంపై చర్చకు పెడితేనే నిజానిజాలు ప్రజలకు తెలుస్తాయని పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ఈ కారు రేసింగ్‌పై చర్చకు అనుమతించకపోవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే సభ నుంచి వాకౌట్ చేశారు.
Next Story