Telugu Global
Telangana

పరిగి సబ్ జైల్లో ఉన్న రైతులను పరామర్శించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు

కొడంగల్ లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి పరిగి సబ్ జైల్లో ఉన్న రైతులను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పరామర్శించారు.

పరిగి సబ్ జైల్లో ఉన్న రైతులను పరామర్శించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
X

కొడంగల్ లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి పరిగి సబ్ జైల్లో ఉన్న రైతులను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గురువారం పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని రైతులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

మరోవైపు లగచర్ల కేసులో అరెస్టయిన కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని హరీశ్‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకారంతో పట్నంను కుట్రపూరితంగా నరేందర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయించారని ఆరోపించారు. కొడంగల్ నుంచే ప్రజాపాలన మీద తిరుగుబాటు మొదలైందని.. ఈ అరెస్ట్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మీకు ఓటేస్తే మేలు జరుగుతుం దనుకుంటే పాపానికి.. లగచర్ల గ్రామం భూములను గుంజుకోవడమే నువ్వు చేసే మేలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

First Published:  14 Nov 2024 3:27 PM IST
Next Story