Telugu Global
Telangana

కేసీఆర్‌తో సబితా ఇంద్రారెడ్డి భేటీ.. ఎందుకంటే!

అసెంబ్లీలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వాకిటి సునీతా లక్ష్మారెడ్డిలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

కేసీఆర్‌తో సబితా ఇంద్రారెడ్డి భేటీ.. ఎందుకంటే!
X

బీఆర్ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ను కలిశారు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కుమారుడు కార్తీక్ రెడ్డితో కలిసి కేసీఆర్‌తో సమావేశం కావడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు కేసీఆర్.

ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీలో జరిగిన ఇష్యూపై కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇక చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరిన అంశంపై ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో పట్లోళ్ల ఫ్యామిలీకి పట్టు ఉంది. కార్తీక్‌ రెడ్డి రాజకీయ భవిష్యత్‌పైనా చర్చించినట్లు సమాచారం. చేవెళ్ల లేదా రాజేంద్రనగర్‌ నియోజకవర్గ BRS ఇన్‌ఛార్జి బాధ్యతలు కార్తీక్‌ రెడ్డికి అప్పగిస్తారని తెలుస్తోంది.

ఇటీవల అసెంబ్లీలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వాకిటి సునీతా లక్ష్మారెడ్డిలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అసెంబ్లీలో కేటీఆర్‌ను ప్రస్తావిస్తూ వెనుక ఇద్దరు అక్కలను(సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి) నమ్ముకుంటే జూబ్లీ బ‌స్టాండ్‌లో నిలబడాల్సి వస్తుందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టుకున్నారు.

First Published:  4 Aug 2024 8:29 PM IST
Next Story