రేవంత్.. ఖమ్మం, నల్గొండ బాంబులు ఎప్పుడైనా పేలొచ్చు
మంత్రి పొన్నం ప్రభాకర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. ఈ చిల్లర పనులకే కరీంనగర్ ప్రజలు తరిమి కొడితే, హుస్నాబాద్ పారిపోయాడు. అక్కడి ప్రజలు తెలిసి, తెలియక ఓట్లేశారు.
సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి. గేట్లు ఎత్తామన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు. "మీరు గేట్లు ఎత్తారు, మేం ఎత్తలేదు. మేం గేట్లు ఎత్తిన రోజు మీరు భూస్థాపితమే రాసిపెట్టుకోండి. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ నల్గొండ బాంబో, ఖమ్మం బాంబో పేలితే మేం బాధ్యులం కాదు. పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వబోతున్నాం. కరీంనగర్ పార్లమెంట్‌ను బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాం".
"ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఇప్పటికైనా హామీల అమలుపై దృష్టి సారించాలి. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు అనర్హత వేటు వేయాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. ఈ చిల్లర పనులకే కరీంనగర్ ప్రజలు తరిమి కొడితే, హుస్నాబాద్ పారిపోయాడు. అక్కడి ప్రజలు తెలిసి, తెలియక ఓట్లేశారు. ఈ అవకాశాన్ని అయినా సద్వినియోగం చేసుకోకుండా, మళ్లీ దుర్వినియోగమే చేస్తున్నాడు. ఆవేశం స్టార్‌గా మారాడు. ఆడియో లీకైన విషయంలో RDO, MROలపై ఫిర్యాదు చేయడం కరెక్ట్ కాదు. చిన్న అధికారులు.. ఉద్యోగులపైనా మీ ప్రతాపం?. రాగ ద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని ప్రమాణం చేసి, దాన్ని ఉల్లంఘించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఎందుకు బర్తరఫ్ చేయకూడదు?" అని ప్రశ్నించారు కౌశిక్‌రెడ్డి.