Telugu Global
Telangana

నేడు తెలంగాణలో బిగ్ డే: అటు బీఆర్ఎస్ మేనిఫెస్టో.. ఇటు కాంగ్రెస్ లిస్ట్

ఇప్పటి వరకూ ఏం చేశామనేది బీఆర్ఎస్ చెబుతూ వచ్చింది, ఈరోజు నుంచి.. ఏం చేయబోతామనేది ఆ పార్టీ నేతలు ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. మేనిఫెస్టో విడుదలతోపాటు అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీఫామ్ లు కూడా ఇదేరోజు ఇస్తారు.

నేడు తెలంగాణలో బిగ్ డే: అటు బీఆర్ఎస్ మేనిఫెస్టో.. ఇటు కాంగ్రెస్ లిస్ట్
X

నేడు తెలంగాణలో బిగ్ డే: అటు బీఆర్ఎస్ మేనిఫెస్టో.. ఇటు కాంగ్రెస్ లిస్ట్

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి నేడు బిగ్ డే. హ్యాట్రిక్ కొడతామంటున్న బీఆర్ఎస్, ఈసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామంటున్న కాంగ్రెస్ పార్టీలకు ఈరోజు చాలా కీలకం. బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల నేడే. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కూడా నేడే. ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణలో పొలిటికల్ హడావిడి మామూలుగా ఉండదని తేలిపోయింది.

మేనిఫెస్టోకోసం ఎదురుచూపులు..

తెలంగాణ ఎన్నికలకు సంంబధించి కాంగ్రెస్ మేనిఫెస్టో మొదటగా విడుదలైంది. ఈరోజు బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదలవుతుంది. అధికార పార్టీ ఎలాంటి హామీలు ఇస్తుంది, కాంగ్రెస్ కి ధీటుగా ఎలాంటి కార్యక్రమాలను తెరపైకి తెస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది. అభ్యర్థులు కూడా మేనిఫెస్టో హామీలపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ ఏం చేశామనేది బీఆర్ఎస్ చెబుతూ వచ్చింది, ఈరోజు నుంచి.. ఏం చేయబోతామనేది ఆ పార్టీ నేతలు ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. మేనిఫెస్టో విడుదలతోపాటు అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీఫామ్ లు కూడా ఇదేరోజు ఇస్తారు. ఇక ఎన్నికల సమరశంఖాన్ని పూరించే తొలి సభ కూడా ఈరోజే. మధ్యాహ్నం మేనిఫెస్టో విడుదల తర్వాత సీఎం కేసీఆర్ ఈరోజు హుస్నాబాద్ సభలో పాల్గొంటారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత సీఎం పాల్గొంటున్న తొలి ఎన్నికల సభ ఇదే.

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా..

అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. వారిని ఎంపిక చేసేందుకు 4 సార్లు భేటీ అయింది. మొత్తం 70 సీట్లపై క్లారిటీ ఇచ్చింది. అయితే, ఇందులో 58 సీట్లకు పార్టీ ఎలక్షన్ కమిటీ ఓకే చెప్పింది. ఈ 58 మంది అభ్యర్థుల జాబితా ఈరోజు మధ్యాహ్నం విడుదల చేస్తారు. పార్టీ తొలి జాబితాలో రేవంత్ రెడ్డి(కొడంగల్), కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(నల్గొండ), ఉత్తమ్ కుమార్ రెడ్డి (హుజూర్ నగర్), మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి(పాలేరు), మైనంపల్లి హన్మంతరావు (మల్కాజ్ గిరి), నారాయణ రెడ్డి(కల్వకుర్తి)తో పాటు పలువురి పేర్లు ఉంటాయని తెలుస్తోంది. జాబితా విడుదల తర్వాత కాంగ్రెస్ లో సిగపట్లు మరో లెవల్ కి చేరుకుంటాయనడంలో ఎలాంటి అనుమానం లేదు.

First Published:  15 Oct 2023 7:12 AM IST
Next Story