15 మందితో బీఆర్ఎస్ మహారాష్ట్ర స్టీరింగ్ కమిటీ.. ఆమోద ముద్ర వేసిన అధ్యక్షుడు కేసీఆర్
మహారాష్ట్రకు సంబంధించి 15 మంది సభ్యులతో తాత్కాలిక స్టీరింగ్ కమిటీని నియమించడానికి అధ్యక్షుడు కేసీఆర్ పచ్చజెండా ఊపారు.
మహారాష్ట్రలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బలోపేతానికి పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరణకు తొలి అడుగు మహారాష్ట్ర నుంచే మొదలవుతుందని గతంలోనే సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడ పలు బహిరంగ సభలు విజయవంతంగా నిర్వహించారు. ఇక పార్టీ పరంగా నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు.
మహారాష్ట్రకు సంబంధించి 15 మంది సభ్యులతో తాత్కాలిక స్టీరింగ్ కమిటీని నియమించడానికి అధ్యక్షుడు కేసీఆర్ పచ్చజెండా ఊపారు. సీఎం కేసీఆర్ చైర్మన్‌గా మరో 14 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు అయ్యింది. ఇక కే. వంశీధర్ రావును మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జిగా నియమించారు. ఈ మేరకు బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకాలు వెంటనే అమలు లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
మహారాష్ట్ర బీఆర్ఎస్ స్టీరింగ్ కమిటీ
1. కే. చంద్రశేఖర్ రావు - చైర్మన్ (ముఖ్యమంత్రి)
2. భానుదాస్ ముర్కుటే - మాజీ ఎమ్మెల్యే
3. శంకర్ అన్న ధోంగే - మాజీ ఎమ్మెల్యే
4. హరిబాబు రాథోడ్ - మాజీ ఎంపీ
5. ఘన్‌శ్యామ్ షేలర్
6. అన్న సాహెబ్ మానే - మాజీ ఎమ్మెల్యే
7. దీపక్ ఆత్రమ్ - మాజీ ఎమ్మెల్యే
8. మాణిక్ కదమ్ - కిసాన్ సెల్ అధ్యక్షుడు
9. కల్వకుంట్ల వంశీధర్ రావు
10. దన్యేష్ వాకుదార్
11. సచిన్ సాతే
12. సురేఖా పునేకర్
13. కదిర్ మౌలానా
14. యశ్‌పాల్ భింగే
15. ఫిరోజ్ పటేల్