Telugu Global
Telangana

కాంగ్రెస్‌కు డి.కె.శివకుమార్ కరెంట్ షాక్‌.!

కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 5 హామీలు అమ‌లు చేయట్లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ప్రధానంగా కర్ణాటకలో రైతులకు కరెంటు 3 నుంచి 5 గంటలే ఇస్తున్నారని.. దీంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తోంది.

కాంగ్రెస్‌కు డి.కె.శివకుమార్ కరెంట్ షాక్‌.!
X

రైతులకు కరెంటు అంశంపై అధికార బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీ మధ్య డైలాగ్‌ వార్ నడుస్తున్న వేళ హస్తం పార్టీకి షాకిచ్చే కామెంట్స్ చేశారు కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్. కర్ణాటకలో అమలు చేస్తున్న 5 గ్యారెంటీలపై క్లారిటీ ఇచ్చేందుకు డి.కె.శివకుమార్‌ను తెలంగాణకు ఆహ్వానించింది కాంగ్రెస్‌. ఇందులో భాగంగా తాండూరులో నిర్వహించిన రెండో విడత విజయభేరీ యాత్రలో పాల్గొన్న డి.కె.శివకుమార్‌.. కర్ణాటకలో ప్రస్తుతం కరువు పరిస్థితుల్లోనూ రైతులకు 5 గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నామని.. 7 గంటలు ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు.


అయితే డి.కె.శివకుమార్‌ వ్యాఖ్యలు బీఆర్ఎస్ ఆరోపణలకు బలం చేకూర్చేలా మారాయి. దీంతో డి.కె.శివకుమార్ వ్యాఖ్యల వీడియోను సోషల్‌ మీడియాలో విరివిగా షేర్ చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇప్పటికే కర్ణాటక రైతులు సరిహద్దు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల గద్వాల, కొడంగల్‌ నియోజకవర్గాల్లో ర్యాలీలు సైతం తీశారు.

కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 5 హామీలు అమ‌లు చేయట్లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ప్రధానంగా కర్ణాటకలో రైతులకు కరెంటు 3 నుంచి 5 గంటలే ఇస్తున్నారని.. దీంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ వస్తే కర్ణాటక పరిస్థితే వస్తుందంటూ ప్రచారం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో డి.కె.శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు మరింత నష్టం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  29 Oct 2023 12:50 AM GMT
Next Story