సీఎం రేవంత్‌రెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల కనీస గౌరవ మర్యాద లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఫిర్యాదు చేశారు.మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పట్ల కనీస గౌరవ మర్యాదలు లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ఉద్దేశించి.. మాట్లాడుతూ.. ‘మీకు మీరే స్టేచర్ ఉందని ఫీలైతే.. స్ట్రేచర్ మీదకు పంపించారు.. ఇట్లనే చేస్తే ఆ తర్వాత మార్చురీకి పోతారు.’ అంటూ అవహేళనగా దూషించారు. రేవంత్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు తీవ్రంగా ఖండించారు.