కేసీఆర్ సొంత కొడుకులా చూసుకుంటే.. నమ్మించి, మోసం చేసి, దగా చేసి..
మహారాష్ట్రకు వెళ్లినా, ఎక్కడికి వెళ్లినా హెలికాప్టర్‌లల్లో కూర్చొబెట్టుకుని తీసుకెళ్లాడు. కానీ, ఇవాళ దానం నాగేందర్ నమ్మించి కేసీఆర్‌కు పెద్ద వెన్నుపోటు పొడిచి పార్టీని వదిలి వెళ్లాడు.
బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు దాసోజు శ్రవణ్ కుమార్. అవకాశవాద రాజకీయాలకు దానం కేరఫ్ అన్నారు. "దానం నాగేందర్ అదృష్టవంతుడు. 2018లో పార్టీలోకి వచ్చిండు, ఎమ్మెల్యే అయ్యిండు. 2023లో మళ్లీ ఎమ్మెల్యే అయ్యిండు. నమ్మించి, మోసం చేసి, దగా చేసి దానం నాగేందర్ వెళ్లిపోయాడు. కేసీఆర్ సొంత కొడుకులా చూసుకున్నాడు. మహారాష్ట్రకు వెళ్లినా, ఎక్కడికి వెళ్లినా హెలికాప్టర్‌లల్లో కూర్చొబెట్టుకుని తీసుకెళ్లాడు. కానీ, ఇవాళ దానం నాగేందర్ నమ్మించి కేసీఆర్‌కు పెద్ద వెన్నుపోటు పొడిచి పార్టీని వదిలి వెళ్లాడు. పక్కపార్టీలోకి వెళ్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు".
"దానంవి అవకాశవాద రాజకీయాలు. నాడు ఆసిఫ్‌నగర్‌లో దానం నాగేందర్ టీడీపీ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. మళ్లీ ఉపఎన్నికలో ఓడిపోయారు. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. సికింద్రాబాద్ పార్లమెంట్‌లో దానం నాగేందర్ ఓటమి ఖాయం" అన్నారు దాసోజు శ్రవణ్.