రేపు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కీలక సమావేశం
హైడ్రా, మూసీ సుందరీకరణపై జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించనున్నారు
హైడ్రా, మూసీ సుందరీకరణపై ఈ నెల 16న తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు.హైడ్రా, మూసీ సుందరీకరణపై చర్చించే ఉంది. ఈ సందర్భంగా హైడ్రా, మూసీ సుందరీకరణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తమ కార్యాచరణను ప్రకటించే ఛాన్స్ ఉంది.ఇక మూసీ సుందరీకరణ పేరిట వేల కోట్లు దొబ్బేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే.
ఢిల్లీకి మూటలు పంపేందుకు మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలను బలి చేస్తారా..? అంటూ రేవంత్ సర్కార్‌ను బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తూనే ఉంది. అంబర్‌పేట, హైదర్షాకోట్, కొత్తపేట వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటించి, మూసీ బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైడ్రా, మూసీ బాధితులు వందల సంఖ్యలో తెలంగాణ భవన్‌కు చేరుకుని తమ గోడును వెల్లబోసుకున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశముంది. సీటీలో చేరువుల సమగ్ర సర్వే చేయాలని నిర్ణయంచి తెలంగాణ ప్రభుత్వం కూల్చివేతలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే