Telugu Global
Telangana

కేసీఆర్‌ అధ్యక్షతన నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు, రజతోత్సవ వేడుకల నిర్వహణపై నేతలతో చర్చించనున్న బీఆర్‌ఎస్‌ అధినేత

కేసీఆర్‌ అధ్యక్షతన నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం
X

పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు, రజతోత్సవ వేడుకల నిర్వహణపై బీఆర్‌ఎస్‌ అధినేత నేడు కీలక సమావేశం నిర్వహించున్నారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. ఏప్రిల్‌ 27తో పార్టీ ఏర్పాటు చేసిన 24 ఏండ్లు పూర్తవుతున్న తరుణంలో రజతోత్సవాలను ఏడాదిపాటు ఘనంగా నిర్వహించాలని ఇటీవల నిర్ణయించారు. ఏప్రిల్‌లో సన్నాహక సదస్సు అనంతరం 27న భారీ బహిరంగ సభ జరపనున్నారు. ఇదే సమయంలో పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ఈసారి ఆన్‌లైన్‌ విధానంలో చేపట్టాలని భావిస్తున్నారు. ప్రత్యేక మొబైల్‌ యాప్‌ రూపొందించడం తదితర వాటిపై చర్చ జరుగుతున్నది. ఈ అంశాల చర్చించడానికి కేసీఆర్‌ నేడు ముఖ్యులతో భేటీ కానున్నారు. శాసన సభ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై కూడా నేతలతో అధినేత చర్చించే అవకాశం ఉన్నది.

First Published:  7 March 2025 10:41 AM IST
Next Story