బీఆర్ఎస్ ఎప్పటికీ టీ-టీమ్.. మోడీకి కేటీఆర్ కౌంటర్
తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఎవరితోనైనా, ఎక్కడిదాకైనా పోరాడే ఏకైక టీ-టీమ్ అన్నారు కేటీఆర్. నిన్నటి దాకా మత రాజకీయం చేసి.. ఇవాళ కుల రాజకీయాలకు తెరతీశారా అంటూ ప్రశ్నించారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవసభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. రాహుల్ వచ్చి మమ్మల్ని బీజేపీ బీ-టీమ్ అంటారని, మీరొచ్చి మేం కాంగ్రెస్ సీ-టీమ్ అంటారని, అసలు తాము బీ-టీమ్, సీ-టీమ్ కాదని.. ముమ్మాటికి టీ-తెలంగాణ టీమ్ అని మోడీని ఉధ్దేశించి ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఎవరితోనైనా, ఎక్కడిదాకైనా పోరాడే ఏకైక టీ-టీమ్ అన్నారు కేటీఆర్. నిన్నటి దాకా మత రాజకీయం చేసి.. ఇవాళ కుల రాజకీయాలకు తెరతీశారా అంటూ ప్రశ్నించారు. పదేళ్ల మీ హయాంలో దేశంలోని పేదలకు మిగిలింది అరణ్య రోదనే అంటూ ఫైర్ అయ్యారు.
ప్రధాని మోదీ గారు..
— KTR (@KTRBRS) November 7, 2023
రాహుల్ వచ్చి..
మమ్మల్ని మీ బీ టీమ్ అంటారు
మీరొచ్చి...
మేము కాంగ్రెస్ సీ టీమ్ అంటారు.
మేం బీజేపీకి బీ టీమ్ కాదు
కాంగ్రెస్ కు సీ టీమ్ కాదు..
మాది ముమ్మాటికీ
T టీమ్.. తెలంగాణ టీమ్
తెలంగాణ ప్రజల హక్కుల కోసం..
ఎవరితోనైనా.. ఎక్కడి దాకైనా పోరాడే ఏకైక టీమ్…
బీసీలంటే బీజేపీ దృష్టిలో బలహీన వర్గాలేమో అన్న కేటీఆర్.. బీఆర్ఎస్ దృష్టిలో బలమైన వర్గాలు అని అభివర్ణించారు. రాష్ట్రంలో బీసీల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ చేసింది బీజేపీ నేతలేనని ఆరోపించారు కేటీఆర్. నిందితులతో వేదిక పంచుకుని.. మాపై నిందలా అంటూ ప్రధాని మోడీని ప్రశ్నించారు.