ఇవిగో మేం సృష్టించిన ఆస్తులు..బీఆర్ఎస్ కౌంటర్
మరోవైపు బీఆర్ఎస్ గత పదేళ్ల పాలనలో సృష్టించిన ఆస్తులపై ఓ రిపోర్టు రిలీజ్ చేసింది. పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్దిని లెక్కలతో సహా అందులో పొందుపరిచింది. బీఆర్ఎస్ రూపొందించిన నివేదికలోని కీలకాంశాలు ఇవే
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై బీఆర్ఎస్ మండిపడింది. శ్వేతపత్రం పూర్తిగా తప్పుల తడకగా ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాంగ్రెస్‌లో కనబడుతోందని ఆరోపించారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రజలు ఎంతో ఆశిస్తున్నారని చెప్పారు. ఈ నివేదికను తెలంగాణ అధికారులు తయారు చేయలేదన్నారు. తెలంగాణ అధికారులపై నమ్మకం లేక.. ఆంధ్రా అధికారులతో ఈ రిపోర్టు తయారు చేయించారని ఆరోపించారు. ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.
ఇక మరోవైపు బీఆర్ఎస్ గత పదేళ్ల పాలనలో సృష్టించిన ఆస్తులపై ఓ రిపోర్టు రిలీజ్ చేసింది. పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్దిని లెక్కలతో సహా అందులో పొందుపరిచింది. బీఆర్ఎస్ రూపొందించిన నివేదికలోని కీలకాంశాలు ఇవే -
If BRS was allowed by Congress Government to display this Factoid in Assembly then every detail,every rupee spent on Asset building of Telangana wud have been explained.
— Krishank (@Krishank_BRS) December 20, 2023
But Congress wants only Blame to be publicised & Achievement to be Erased.
So spread this as much as u can pic.twitter.com/nYGwRfacF0
--అప్పులు కాదు ఆస్తులు పెంచాం
--పదేళ్లలో ప్రభుత్వ ఆస్తులు పెంచామని చెప్తున్న గులాబీ పార్టీ
--51 పేజీల ఆస్తుల వివరాలను విడుదల
--33 జిల్లాలకు 1649.62 కోట్ల కలెక్టరేట్ల భవనాల నిర్మాణాలు.
--ఇప్పటికే 25 కలక్టర్ భవనాలు ప్రారంభం
--2014 తర్వత 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్ ల ఏర్పాటు
--రాష్ట్రంలో ప్రస్తుతం 32 వేల 717 కిలోమీటర్ల రోడ్లు
--8578 కిలో మీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మాణం
--కొత్తగా 4713 చెత్త తరలించే వాహనాలు
--1022 కొత్త గురుకులాలు, 849 ఇంటర్ గురుకులాలు, 85 డిగ్రీ గురుకులాలు
--7289.54 కోట్లతో మన ఊరు బడి తో 1240 బడుల నిర్మాణం, 1521 స్కూళ్ళలో సౌర విద్యుత్,
--23,37 654 మంది విద్యార్థులకు లబ్ధి
--కేజి టూ పీజీ గంబిరావు పేట లో తొలి క్యాంపస్
--70 గదుల నిర్మాణం
--250 మందికి సరిపడేలా అంగన్వాడీ కేంద్రం
--1000 మంది కూర్చునేల డైనింగ్ హాల్
--22.5లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు
--334 చిన్న పరిశ్రమల పురుద్దరణ
--10,400 ఎకరాల్లో అతిపెద్ద పార్మ క్లస్టర్
--81.81 చ.కి.మి పెరిగిన పచ్చదనం, హరిత హరం
--HMDA పరిధిలో 129 ప్రదేశాల్లో 188 ఫారెస్ట్ బ్లకులు
--19472 పల్లె ప్రకృతి వనాలు, 13657ఎకరాల విస్తీర్ణం
--109 అర్బన్ ఫారెస్ట్ 75 740 ఎకరాల విస్తీర్ణం
--1,00,691 కిమి రహదారి వనాలు
--10,886 కిమీ కందకాల తవ్వకం
--19వేల పల్లెల్లో పార్కులు
--2700 ట్రీ పార్కులు
--1200 కోట్ల తో యాదాద్రి పునర్నిర్మాణం
--2800 కోట్ల ఆలయాల అభివృద్ధి
--100 కోట్లతో దేవాదాయ శాఖ కు నిధులు
--75 కోట్లు దూప దీప నైవేద్యం కింద అర్చకుల వేతనం
--212 కోట్ల తో బ్రహ్మణ సంక్షేమం కోసం
--ఆరోగ్య శాఖ లో
34000 హాస్పిటల్ బెడ్స్
34000 ఆక్సిజన్ బెడ్స్,
80 ఐ సీ యు కేంద్రాలు
56బ్లడ్ బ్యాంక్ లు
82 డయాలసిస్ కేంద్రాలు
500 బస్తీ దవాఖానాలు
--1000 పడకల అల్వాల్ టీమ్స్, ఎరగడ్డ టీమ్స్, గడ్డి అన్నారం టీమ్స్, 1261 బెడ్ల తో గచ్చి బౌలి టీమ్స్
--1571 కోట్ల తో నిమ్స్ 2000 పడకల ఆసుపత్రి విస్తరణ
--3779 కోట్ల తో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
--33 మెడికల్ కాలేజీలు నిర్మాణం, 8515 మంది ఎంబీబీఎస్ సీట్లు
--585 కోట్ల తో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్
--137 పోలీసు భవనాల నిర్మాణం, 654.50 కోట్లతో జిల్లా ఎస్పీ కార్యాలయాలు
--10.13 లక్షల సీసీ కెమెరాలు
--20,115 పోలీసు వాహనాలు
--9 కమీషనరేట్ల ఏర్పాటు, 719 సర్కిల్స్, 164 పోలీస్ సబ్ డివిజన్ లు, 815 పోలీస్ స్టేషన్ పెంపు
--కాళేశ్వరం ప్రోజెక్ట్ నిర్మాణం, పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకం (35 వేల కోట్లు) ప్రారంభం
--విద్యుత్ రంగం 2014లో 7748 మెగావాట్ల నుంచి2023 లో 19, 464 మెగావాట్ల కు పెంపు
--15497 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం
--వ్యవసాయానికి , గృహ వినియోగానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం
--57.82 శాతం తలసరి విద్యుత్ వినియోగం లో వృద్ది
--లోడ్ మెయింటేన్స్ లో ట్రాన్స్ ఫార్మర్స్ బిగింపు
--2014 లో విద్యుత్ సంస్థల అప్పు 22,423 కోట్లు, 2023 లో 81 వేల కోట్లు
--2014 లో 44,431 కోట్ల విద్యుత్ ఆస్తులు
--2023 లో 1,37, 571 కోట్ల పెరిగిన విద్యుత్ ఆస్తులు
--59 వేల కోట్ల అప్పులు, 93 వేల కోట్ల ఆస్తుల పెరుగుదల
--ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ఈ 10 ఏళ్లలో 70, 965.75 కోట్ల తో నిధులు ఖర్చు
--దళిత బంధు పథకం అమలు
--5000 కోట్లతో గొర్రెల పంపిణీ
--72,817 కోట్ల రైతు బంధు నిధుల విడుదల
--5402 కోట్ల రైతు బీమా
--572 కోట్ల తో రైతు వేదికల ఏర్పాటు
--1,98, 37 వేల ఎకరాల మేర పెరిగిన పంట విస్తీర్ణం
--గ్రామాల్లో 100 శాతం మంచి నీటి సౌకర్యం, స్కూళ్ళు, అంగన్వాడీ లు, ప్రభుత్వ సంస్థల్లో నీటి సౌకర్యం
--8735.32 కోట్ల తో మిషన్ కాకతీయ, 21, 633 చెరువుల పునరుద్దరణ
--617 కోట్ల తో కొత్త సచివాలయం నిర్మాణం*
--146.50కోట్ల తో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం
--178 కోట్లతో 3ఎకరాల్లో అమరవీరుల స్మారక జ్యోతి
--2014 లో 27, 200 కోట్ల సేల్స్ టాక్స్ 2023 లో 72564 కోట్ల వసూళ్లు
--2014 లో 2832 కోట్ల రిజిస్ట్రేషన్ ఆదాయం ప్రస్తుతం 14, 291 కోట్ల వసూలు
--2014 లో 1,24,104 కోట్లు ఉన్న తలసరి ఆదాయం 2023 లో 3.12,398 కోట్ల పెరిగిన తలసరి ఆదాయం
--159.6 పెరిగిన తలసరి ఆధాయం