Telugu Global
Telangana

గ్యాస్ సిలండర్ల ధర పెంపును నిరసిస్తూ ఎల్లుండి రాష్ట్ర వ్యాప్త ఆందోళన‌లకు బీఆరెస్ పిలుపు

గ్యాస్ సిలండర్ల ధరల పెంపు అంశంపై ఈ రోజు కేటీఆర్ భారత రాష్ట్ర సమితి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గ్యాస్ ధర పెంపుకు నిరసనగా ఎల్లుండి అన్ని నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

గ్యాస్ సిలండర్ల ధర పెంపును నిరసిస్తూ ఎల్లుండి రాష్ట్ర వ్యాప్త ఆందోళన‌లకు బీఆరెస్ పిలుపు
X

కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలండర్ల ధరలను పెంచడాన్ని బారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండించింది. ఈ నెల 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాల్సిందిగా పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది.

గ్యాస్ సిలండర్ల ధరల పెంపు అంశంపై ఈ రోజు మంత్రి కేటీఆర్ భారత రాష్ట్ర సమితి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గ్యాస్ ధర పెంపుకు నిరసనగా ఎల్లుండి అన్ని నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎక్కడి వారక్కడ వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ సూచించారు.

గ్యాస్ సిలండర్ల ధర పెంపును నిరసిస్తూ ఎల్లుండి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆరెస్ పిలుపు

'' మోడీ ప్రభుత్వం రాకముందు 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఈరోజు 1160ని దాటి 1200లకు చేరుకుంది. పెరుగుతున్న సిలిండర్ ధరలపైన ప్రజలకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయి… పెరుగుతున్న సిలిండర్ ధరలు, నిత్యవసర సరుకుల పెరుగుదల పైన ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం ఉన్నది. ఈ ధరల పెరుగుదల వలన ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.'' అని మండిపడ్డారు.

ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భరించలేని భారాలను మోపుతోందని విమర్శించారు. బండి సంజయ్ నరేంద్ర మోడీని దేవుడని పొగుడుతున్నారని ఇలా ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతున్నందుకే ఆయన దేవుడయ్యాడా ? అని ప్రశ్నించారు. గ్యాస్ సిలండర్ ధరలు పెంచడంపై ఆమె స్పందిస్తూ అన్నిటి మీద మోడీ బొమ్మలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలండర్ల‌ మీద కూడా మోడీ బొమ్మపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతీ సంక్షేమ కార్యక్రమం గురించి మోడీని పొగుడుతూ ప్రజల ఫోన్లకు మెసేజ్ లు పంపే కేంద్ర ప్రభుత్వం సిలండర్ ధరల పెంపుపై కూడా మోడీ పేరుతో మెసేజులు పంపాలని ఆమె అన్నారు. ఈ ధరల పెంపు వల్ల రాష్ట్రంలోని వినియోగదారులపై 70 కోట్ల రూపాయల అదనపు భారంపడుతోందని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

మోడీకి మహిళలపట్ల ఎంత వివక్ష ఉందో దీన్ని బట్టి అర్దమవుతోందని, మహిళలంతా సంఘటితమైతే వారి శక్తి ఏంటో మోడీకి అర్దమవుతుందని ఆమె హెచ్చరించారు. దేశానికి గుదిబండలా తయారైన మోడీ పాలనకు మహిళలే చరమగీతం పాడాలని మంత్రి కోరారు.

First Published:  1 March 2023 5:48 PM IST
Next Story