Telugu Global
Telangana

ఎమ్మెల్సీలపై BRS అనర్హత పిటిషన్‌.. గుత్తాకు కఠిన పరీక్ష

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌ బై చెప్పారు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి. ఆయన కొడుకు కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి నాగర్‌కర్నూలు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఎమ్మెల్సీలపై BRS అనర్హత పిటిషన్‌.. గుత్తాకు కఠిన పరీక్ష
X

రెబల్‌ ఎమ్మెల్సీలకు షాక్‌ ఇచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది బీఆర్ఎస్‌ పార్టీ. ఈ మేరకు ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరారు BRS ఎమ్మెల్సీలు. ఈ మేరకు శేరి సుభాష్‌ రెడ్డి నేతృత్వంలో మండలి ఛైర్మన్ గుత్తాను కలిసి ఫిర్యాదు చేశారు.

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆదేశాల మేరకు మండలి ఛైర్మన్ గుత్తాను కలిసినట్లు చెప్పారు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి. బీఆర్ఎస్ బీ-ఫారం మీద ఎమ్మెల్సీలుగా ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరినట్లు చెప్పారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలు ఛైర్మన్‌కు సమర్పించామన్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌ బై చెప్పారు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి. ఆయన కొడుకు కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి నాగర్‌కర్నూలు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు పట్నం మహేందర్ రెడ్డి దంపతులు. పట్నం మహేందర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండగా.. ఆయన సతీమణి సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజ్‌రిగి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్‌.

ఇక మండలి ఛైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం పార్టీ మారతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన కుమారుడికి భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తే కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన రెడీగా ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌పై గుత్తా ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.

First Published:  22 March 2024 5:50 PM GMT
Next Story