Telugu Global
Telangana

వేం నరేందర్‌ రెడ్డిపై ఈసీకి BRS ఫిర్యాదు.. ఎందుకంటే..!

రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి జీతభత్యాలు పొందుతూ వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో పాల్గొనడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని ఫిర్యాదులో పేర్కొంది బీఆర్ఎస్‌.

వేం నరేందర్‌ రెడ్డిపై ఈసీకి BRS ఫిర్యాదు.. ఎందుకంటే..!
X

సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డిపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. నిబంధనలు ఉల్లంఘించి కాంగ్రెస్‌ పార్టీ మీటింగ్‌లో పాల్గొనడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

అధికారిక ఉత్తర్వులతో ముఖ్యమంత్రి సలహాదారుడిగా నియమితులై, కేబినెట్ హోదాలో ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి జీతభత్యాలు పొందుతూ వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో పాల్గొనడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని ఫిర్యాదులో పేర్కొంది బీఆర్ఎస్‌. నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకోరాదని, సలహాదారులకు కూడా ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిందని గుర్తుచేసింది.


కానీ, వేం నరేందర్ రెడ్డి నిబంధనలను బేఖాతరు చేస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న మహబూబాబాద్‌ జనజాతర సభకు సంబంధించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారని ఫిర్యాదులో పేర్కొంది బీఆర్ఎస్‌. ఈ అంశంపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.

First Published:  18 April 2024 3:13 PM IST
Next Story