Telugu Global
Telangana

రాష్ట్రంలో వైద్య పరిస్థితులపై బీఆర్‌ఎస్‌ కమిటీ

డాక్టర్‌ రాజయ్య, సంజయ్‌, ఆనంద్‌ తో కమిటీ ఏర్పాటు చేసిన పార్టీ

రాష్ట్రంలో వైద్య పరిస్థితులపై బీఆర్‌ఎస్‌ కమిటీ
X

తెలంగాణలో దిగజారిన వైద్య ఆరోగ్య స్థితిగతులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేయడానికి బీఆర్‌ఎస్‌ ఫ్యాక్ట్ ఫైండింగ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. మాజీ మంత్రి డాక్టర్‌ రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ సభ్యులుగా ఉంటారు. గాంధీ హాస్పిటల్‌ లో ఒక్క నెలలో పెద్ద సంఖ్యలో శిశువులు మృతిచెందడం, రాష్ట్రంలో దుర్బరమైన వైద్య పరిస్థితులపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. గాంధీ హాస్పిటల్‌ లో నెలకొన్న దుర్భర పరిస్థితులు, పెద్ద సంఖ్యలో మాతాశిశు మరణాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోగా ఎదురుదాడికి దిగింది. ఈ నేపథ్యంలో గాంధీ హాస్పిటల్‌ తో పాటు రాష్ట్రంలోని అన్ని హాస్పిటళ్లలో పరిస్థితులపై నిజనిర్దారణ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్‌ రాజయ్య కమిటీని ఏర్పాటు చేశారు.

First Published:  20 Sept 2024 9:07 PM GMT
Next Story