ఈసీ చర్యలపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
సీఎం రేవంత్ రెడ్డి తననుద్దేశించి పేగులు మెడకేసుకుంటా, గుడ్లు పీకుతా అని విమర్శలు చేసినప్పటికీ.. ఆయనపై ఈసీ నిషేధం విధించలేదన్నారు.
ఎన్నికల సంఘం తన ప్రచారంపై విధించిన ఆంక్షలపై స్పందించారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితకు మద్దతుగా మహబూబాబాద్ రోడ్‌షోలో పాల్గొన్న కేసీఆర్.. ప్రచారంలో పాల్గొనవద్దని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించిందన్నారు.
కానీ.. సీఎం రేవంత్ రెడ్డి తననుద్దేశించి పేగులు మెడకేసుకుంటా, గుడ్లు పీకుతా అని విమర్శలు చేసినప్పటికీ.. ఆయనపై ఈసీ నిషేధం విధించలేదన్నారు. ఎలక్షన్ కమిషన్ 48 గంటలు తన ప్రచారంపై నిషేధం విధిస్తే.. గులాబీ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారంటూ కామెంట్ చేశారు కేసీఆర్.
ఎన్నికల కమీషన్ 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే..
— BRS Party (@BRSparty) May 1, 2024
లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా పని చేస్తరు.
మహబూబాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ @KCRBRSPresident#VoteForCar #KCRBusTour #LokSabhaElections2024 pic.twitter.com/FMlNrWaEEO
కాసేపటి క్రితం కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం అమల్లోకి వచ్చింది. 48 గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉండనుంది. షెడ్యూల్ ప్రకారం రేపు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జమ్మికుంటలో కేసీఆర్ రోడ్ షో చేయాల్సి ఉంది. ఎల్లుండి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని రామగుండలో రోడ్ షో నిర్వహించాల్సి ఉంది. ఈసీ నిషేధంతో కేసీఆర్ రోడ్ షో షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది.