బీసీల జోలికొస్తే కాంగ్రెస్ ని భూస్థాపితం చేస్తాం..
బీసీల జోలికొస్తే కాంగ్రెస్ ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తామన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే బీసీ నాయకత్వాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని ఆరోపించారు తెలంగాణ మంత్రులు. ప్రజాప్రతినిధులను వ్యక్తిగతంగా, కించపరిచే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. బీసీల్లో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ అహంకారంతో వారు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీల జోలికొస్తే కాంగ్రెస్ ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తామన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే బీసీ నాయకత్వాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
బీసీ ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా, కించపరిచే విధంగా ఆరోపణలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైఖరిపై రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, ఎమ్మెల్సీలు మధుసూదనా చారి,… pic.twitter.com/x1sxu2YQTr
— BRS Party (@BRSparty) July 19, 2023
హైదరాబాద్ లో మంత్రి తలసాని ఇంట్లో సమావేశమయ్యారు బీఆర్ఎస్ బీసీ నేతలు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, బీసీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఈ సమావేశంలో పాల్గొని బీసీ ఉమ్మడి గళం వినిపించారు. బీసీలను కించపరిచేలా కాంగ్రెస్ పార్టీ కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ లను పెట్టుకుందని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీసీలలో పంచాయితీ పెట్టాలని కొంతమంది ప్లాన్ చేస్తున్నారన్నారు. బీసీ ఓట్లతో గెలిచి, బీసీ నాయకత్వాన్నే టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. కులాల వారీగా మీటింగ్ లు పెట్టి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీసీలపై చేసిన వ్యాఖ్యలకు ముక్కు, చెంపలు వేసుకుంటే తప్ప కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టబోమన్నారు.
నోరుందని బీసీలపై ఇష్టారీతిలో మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బీసీ నేతలపై వ్యక్తిగత దాడులు చేస్తే సహించబోమన్నారు. తాము తెగిస్తే దేనికి భయపడబోమని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తామేమిటో నిరూపించుకుంటామని చెప్పారు తలసాని. అనుచిత వ్యాఖ్యలు చేసి లాభం పొందుతారని అనుకుంటే అది మీ కర్మ అని కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి అన్నారు. కళ్లు తెరవకుంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీలను ఏకం చేసి కాంగ్రెస్ అంతు చూస్తామని తలసాని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆత్మగౌరవ భవనాలు నిర్మించామని రైతు బంధు, రైతు బీమా.. మెజారిటీ బీసీలకు అందుబాటులో ఉన్నాయని వివరించారు.