సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్.. సర్వే రిపోర్టు ట్వీట్ చేసిన కేటీఆర్
బడే భాయ్ మోడీ.. చోటా భాయ్ రేవంత్ మధ్య తెలంగాణలో తీవ్ర గందరగోళం నెలకొందని న్యూస్ - 24 సర్వే స్పష్టం చేసిందన్నారు కేటీఆర్.
తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలవబోతుందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు న్యూస్ - 24 ఛానల్ వెల్లడించిన సర్వే ఫలితాలను కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సర్వేలో బీఆర్ఎస్‌కు 8 స్థానాలు వస్తాయని న్యూస్ - 24 అంచనా వేసింది. కాంగ్రెస్ - 2, బీజేపీ - 6 స్థానాల్లో విజయం సాధిస్తాయని సర్వే స్పష్టం చేసింది.
బడే భాయ్ మోడీ.. చోటా భాయ్ రేవంత్ మధ్య తెలంగాణలో తీవ్ర గందరగోళం నెలకొందని న్యూస్ - 24 సర్వే స్పష్టం చేసిందన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతుందన్నారు. అయితే ఈ 8 సీట్ల నుంచి.. 13-14 స్థానాలు గెలిచేందుకు కష్టపడుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కేటీఆర్.
Bada Bhai Modi and Chota Bhai Revanth are in for a rude awakening in Telangana says News 24 latest survey@BRSparty will emerge as the single largest party it predicts
— KTR (@KTRBRS) April 29, 2024
I appeal to all my party colleagues; Let’s work hard to make the 8 seats to 13-14
Jai Telangana ✊ pic.twitter.com/bpFYsz7H5F
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని ముందే అంచనా వేసింది న్యూస్ - 24 ఛానల్. కాంగ్రెస్‌కు 61-67 సీట్లు వస్తాయని ముందే ఊహించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో న్యూస్ - 24 చెప్పిందే నిజమైంది.