Telugu Global
Telangana

బీఆరెస్, కాంగ్రెస్ కలిసి పోరాడాలి....జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

రాహుల్ పై అనర్హత వేటును ఖండించి, కాంగ్రెస్ తో కలిసి నిరసనలు నిర్వహించిన‌ బీఆరెస్ అదే స్పూర్తిని కొనసాగించాలని, జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీఆరెస్ కలిసి పని చేయాలని జానా రెడ్డి అన్నారు.

బీఆరెస్, కాంగ్రెస్ కలిసి పోరాడాలి....జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత పొత్తు తప్పదనుకుంటే ప్రజలు నిర్ణయిస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ పై అనర్హత వేటును ఖండించి, కాంగ్రెస్ తో కలిసి నిరసనలు నిర్వహించిన‌ బీఆరెస్ అదే స్పూర్తిని కొనసాగించాలని, జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీఆరెస్ కలిసి పని చేయాలని జానా రెడ్డి అన్నారు.

తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై జానారెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలసి పని చేస్తామని తెలిపారు. BRS పార్టీతో కాంగ్రెస్ పొత్తు అంశంపై వ్యాఖ్యానించిన జానారెడ్డి ఎన్నికలు వచ్చినప్పుడు దీనిపై ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని, బీఆర్ఎస్ కూడా ఇప్పటికే రాహుల్ గాంధీకి అండగా నిలిచినట్లు ఆయన అన్నారు.

రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దును జానారెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కేంద్రం పనిచేస్తోందని, కేంద్ర నియంతృత్వ ధోరణిని ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

మోడీ, అదానీ మధ్య ఉన్న సంబంధం బయటపెట్టినందుకే పార్లమెంట్‌లో రాహుల్ గొంతు నొక్కారని జనారెడ్డి విమర్శించారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని, ప్రజాస్వామ్య విలువలు కాపాడేది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీకి తగిన బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని జానారెడ్డి పేర్కొన్నారు.

First Published:  31 March 2023 1:40 PM GMT
Next Story