రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న రమణగాడు
నిన్న రాత్రి తన క్లాస్ మేట్ ని, ఆమె అక్కని కత్తితో పొడిచిన ఆ ఉన్మాది.. చివరకు రైలుకింద పడి చనిపోయాడు.
ఇటీల గుంటూరు కారం సినిమాతో రమణగాడు అనే పేరు బాగా పాపులర్ అయింది. ఈరోజు మళ్లీ ఆపేరు క్రైమ్ న్యూస్ లో హైలైట్ గా మారింది. రమణ అనే బాలుడు తన క్లాస్ మేట్ ని కత్తితో పొడిచి.. పోలీసులు వెతుకుతున్నారనే భయంతో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకోవడం హైదరాబాద్ లో సంచలనంగా మారింది. నిన్న రాత్రి తన క్లాస్ మేట్ ని, ఆమె అక్కని కత్తితో పొడిచిన ఆ ఉన్మాది.. చివరకు రైలుకిందపడి చనిపోయాడు.
హైదరాబాద్ అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తురాబ్ నగర్ లో ఉండే ఓ బాలుడు, సమీపంలో ఉండే మరో బాలికను ప్రేమ పేరుతో వేధిస్తుండేవాడు. వారిద్దరూ క్లాస్ మేట్స్. దగ్గర్లోని ఓ స్కూల్ లో 10వతరగతి చదువుతున్నారు. ఇటీవల ఆ బాలిక తల్లి అనారోగ్యంతో చనిపోవడంతో బంధువుల సంరక్షణలో ఉంటూ ఆమె చదువుకుంటోంది. తన ప్రేమను నిరాకరించడంతో కక్షగట్టిన ఆ బాలుడు.. ఆమెను హత్య చేయాలనుకున్నాడు. రాత్రి ట్యూషన్ కి వెళ్లి వస్తుండగా దారిలో అటకాయించాడు. గొడవ పెట్టుకుని ఆ బాలికను కత్తితో పొడిచాడు. ఆమె అక్కని కూడా గాయపరిచాడు. ఆ ఘటన తర్వాత వెంటే నిందితుడు అక్కడినుంచి పారిపోయాడు. స్థానికులు ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
ఆ ఘటన తర్వాత అక్కడినుంచి పరారైన ఆ ఉన్మాది, చివరకు రైలు పట్టాలపై శవమై తేలాడు. తప్పు చేశాననుకున్నాడో లేక, పోలీసులు పట్టుకుంటే శిక్ష తప్పదని అనుకున్నాడో తెలియదు కానీ తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. విద్యానగర్ సమీపంలో రైలుకింద పడి చనిపోయాడు. పోలీసులు ఆ బాలుడి మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. రాత్రి జరిగిన దాడి ఘటనలో అతడే నిందితుడని నిర్థారించారు