Telugu Global
Telangana

మైనర్ భార్య అంగీకారంతో శృంగారంలో పాల్గొన్న అత్యాచారమే

బోంబాయి హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మైనర్ భార్య అంగీకారంతో సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ అది అత్యాచారమే అవుతుందని బాంబే హైకోర్టు తెలిపింది.

మైనర్ భార్య అంగీకారంతో శృంగారంలో పాల్గొన్న అత్యాచారమే
X

బోంబాయి హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మైనర్ భార్య అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నప్పటికీ అది అత్యాచారమే అవుతుందని బాంబే హైకోర్టు తెలిపింది. అలాంటి చర్యకు చట్ట ప్రకారం రక్షణ ఉండదని కోర్టు తేల్చి చెప్పింది. భార్యపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కింది కోర్టు విధించిన పదేళ్ల శిక్షను బాంబే హైకోర్టు నాగ్‌పూర్ ధర్మాసనం సమర్థించింది. ఆమె పెళ్లి చేసుకుందా? లేదా? అన్న దానితో సంబంధం లేకుండా 18 ఏళ్లలోపు ఉన్న మహిళతో లైంగిక సంబంధం పెట్టుకోవడం అత్యాచారంగానే పరిగణించాలని జస్టిస్ జేఏ సనప్‌ తెలిపింది.

భార్య లేదా అమ్మాయి వయసు 18 ఏళ్లు కంటే తక్కువ వయస్సు ఉన్నప్పుడు ఆమె అంగీకారంతో సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ రక్షణ అందుబాటులో ఉండదని వివరించింది. ఈ కేసులో కింది కోర్టు నిందితుడికి విధించిన పదేళ్ల శిక్షను హైకోర్టు సమర్థించింది. మ్యారేజ్‌కి ముందు తనతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకోవడం వల్ల గర్భం దాల్చాల్సి వచ్చిందని బాధిత మహిళ కోర్టుకెక్కింది. ఆ తర్వాత వారికి వివాహమైనప్పటికీ, కొంతకాలం తర్వాత వారి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. అనంతరం ఆమె భర్తపై కోర్టుకెక్కింది. వారికి పెళ్లి జరిగినప్పటికీ ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా శృంగారంలో పాల్గొన్నాడన్న ఆరోపణల నేపథ్యంలో అది అత్యాచారంగానే కోర్టు భావించింది.

First Published:  15 Nov 2024 3:25 PM IST
Next Story