Telugu Global
Telangana

భార్యతో గొడవ.. ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు

ప్రజాభవన్‌లో అడుగడుగును తనిఖీ చేసి చివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చారు. బాంబు బెదిరింపు ఫేక్‌గా తేల్చిన అధికారులు తాజాగా నిందితుడిని అరెస్టు చేసి అతడిని విచారించారు.

భార్యతో గొడవ.. ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు
X

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసం ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కేసులో పోలీసులు పురోగతి సాధించారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. నిందితుడు గుంటూరు జిల్లాకు చెందిన రామకృష్ణగా గుర్తించారు.

మంగళవారం ప్రజాభవన్‌తో పాటు నాంపల్లి కోర్టులో బాంబు పెట్టినట్లు కంట్రోల్‌ రూమ్‌కు రామకృష్ణ ఫోన్ చేశారు. దీంతో అధికారులు హుటాహుటిన తనిఖీలు చేపట్టారు. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది.

ప్రజాభవన్‌లో అడుగడుగును తనిఖీ చేసి చివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చారు. బాంబు బెదిరింపు ఫేక్‌గా తేల్చిన అధికారులు తాజాగా నిందితుడిని అరెస్టు చేసి అతడిని విచారించారు. భార్యతో గొడవ పడి రామకృష్ణ మద్యానికి బానిసగా మారినట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్య దూరం అయిందన్న బాధతోనే రామకృష్ణ బాంబు బెదిరింపు కాల్స్ చేసినట్లు పోలీసులు తేల్చారు.

First Published:  29 May 2024 1:41 PM GMT
Next Story