గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. శంషాబాద్‌లో మొక్కలు నాటిన కంగనా రనౌత్
శంషాబాద్ వచ్చిన కంగనా.. మొక్కలు నాటి సెల్ఫీలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కంగనా రనౌత్‌కు గ్రీన్ ఇండియా చాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ వృక్ష వేదం పుస్తకాన్ని బహుమతిగా అందించారు.
బీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోశ్ కుమార్ గత కొన్నేళ్లుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో పచ్చదనాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల్లో పచ్చదనంపై అవగాహన కలిగించడానికి అప్పడప్పుడు సెలెబ్రిటీలు, సినిమా స్టార్లతో కూడా మొక్కలు నాటిస్తుంటారు. ఎంపీ సంతోశ్ కుమార్ పిలుపు మేరకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.
హైదరాబాద్ శివారు శంషాబాద్ పంచవటి పార్కులో నటి కంగనా రనౌత్ మొక్కలు నాటారు. ప్రముఖ జ్యోతిష్యుడు బాలు మున్నంగి విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన కంగనా రనౌత్.. ఈ మేరకు శంషాబాద్ వచ్చిన సందర్భంగా.. మొక్కలు నాటి సెల్ఫీలు తీసుకున్నారు. మొక్కలు నాటిన అనంతరం కంగనా రనౌత్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ వృక్ష వేదం పుస్తకాన్ని బహుమతిగా అందించారు. కాగా కంగన.. తన సిస్టర్స్ రంగోలీ చందర్, రీతూ రనౌత్, అంజలీ చౌహాన్‌లను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు.
నటి కంగనా ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడంపై ఎంపీ సంతోశ్ కుమార్ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మీరు మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ రోజు మీరు చేసిన పని వల్ల దేశంలో ఉన్న మీ అభిమానులు అందరూ సంతోషపడతారని.. భవిష్యత్ కోసం ఏం చేయాలో వారు కూడా తెలుసుకొని మొక్కలు నాటుతారని సంతోశ్ రావు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
That’s amazing #KanganaRanaut ji! Thank you so very much for planting saplings as part of our #GreenIndiaChallenge initiative. Hope your huge fanbase across PanIndia would replicate what you have done today in the interest of the better tomorrow.https://t.co/vZUBiMZmPz pic.twitter.com/JnQHgsUUp6
— Santosh Kumar J (@MPsantoshtrs) February 22, 2023