Telugu Global
Telangana

ఎన్నికలున్న రాష్ట్రాలకు వరాలు, లేని రాష్ట్రాలపై వివక్ష

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ధ్వజమెత్తిన హరీశ్‌రావు

ఎన్నికలున్న రాష్ట్రాలకు వరాలు, లేని రాష్ట్రాలపై వివక్ష
X

ఎన్నికలున్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి, ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపడం సరికాదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వివిధ ఛానళ్లలో మాట్లాడారు. 2024 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల బడ్జెట్, 2026 యూపీ ఎన్నికలు ఉంటే యూపీ బడ్జెట్, 2027 గుజరాత్ ఎలెక్షన్ల కోసం బడ్జెట్ పెడితే..తెలంగాణకు సరిపోయే బడ్జెట్ ఎప్పుడు పెడతారు? అని ప్రశ్నించారు. అధికంగా నిధులు ఇవ్వడం పక్కన పెడితే హక్కుగా రావాల్సినవి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు.

దేశ జీడీపీకి 5.1 శాతం ఇస్తున్న తెలంగాణకు, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించడం లేదు.దేశాభివృద్ధి అంటే కొన్ని రాష్ట్రాల అభివృద్ధి కాదు కదా అని ప్రశ్నించారు.సొంత ఆదాయ వనరుల పునరుద్ధరణలో దేశంలో అగ్రగ్రామిగా ఉన్న తెలంగాణకు చేయూత ఇవ్వకుండా తక్కువ నిధులు ఇస్తూ చిన్న చూపు చూడటం కరెక్ట్ కాదన్నారు. పార్టీలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాలు ఒక్కతాటిపైన రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో భవిష్యత్తులో సంకీర్ణ ప్రభుత్వమే ఉంటుందని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేస్తే మనకు రావాల్సిన హక్కులను కాపాడుకోవచ్చు, నిధులను సాధించుకోవచ్చన్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.కేసీఆర్ ఎక్కడా రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించలేదు. కాంగ్రెస్ వైఫల్యాల గురించే ప్రజల తరపున మాట్లాడారు. రాష్ట్రాన్ని సాధించిన నాయకుడి పట్ల, పదేండ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి పట్ల మాట్లాడే భాష ఇదేనా ? తప్పడు నిర్ణయాల వల్ల రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసి వ్యక్తిగతంగా దూషిస్తే యెట్లా ? అని ప్రశ్నించారు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని సూచించారు. ప్రతిపక్ష నాయకుడు ప్రజల తరపున పోరాడకూడదా ? అని నిలదీశారు. పాజిటివ్ గ్రోత్ లో ఉన్న రాష్ట్రాన్ని నెగిటివ్ గ్రోత్ లో తీసుకెళ్లారని మండిపడ్డారు.సీఎం స్థాయి వ్యక్తి రివెంజ్ పాలిటిక్స్ చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా ? రేవంత్ రెడ్డి వైఖరి వల్ల హైదరాబాద్ ఎల్లో జోన్ లోకి వెళ్ళింది.ఇప్పటికైనా రివెంజ్ పాలిటిక్స్ వదిలి పరిపాలన మీద దృష్టి పెట్టాలని సీనియర్ ఎమ్మెల్యేగా హితవు పలికారు.


First Published:  1 Feb 2025 11:40 PM IST
Next Story