Telugu Global
Telangana

హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ దుకాణం ఓపెన్ : కేటీఆర్

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కృషి వల్లే తెలంగాణలో భూముల రేట్లులు పెరిగాయిని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ దుకాణం ఓపెన్ : కేటీఆర్
X

మాజీ సీఎం కేసీఆర్ కృషి వల్లే తెలంగాణలో భూముల ధరలు పెరిగాయిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ శ్రీనగర్‌ కాలనీలో నిర్వహించిన తెలంగాణ రియల్టర్స్‌ ఫోరమ్‌ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. 2014కు ముందు రాష్ట్రంలో భూముల రేట్లు చాలా తక్కువగా ఉండేవి మాజీ మంత్రి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు మేలు చేయాలని పాలకులు ఆలోచించలేదని అన్నారు. తెలంగాణ వస్తే పెట్టుబడులు, కంపేనీలు రావని భయపెట్టారని కేటీఆర్ పేర్కొన్నారు. తన తాతకు 400 ఎకరాల భుమి ఉండేదని.. అయితే అన్ని ఎకరాలు ఉన్నప్పటికీ నీళ్లు లేకపోవడంతో అవి నిరుపయోగంగా, విలువ లేకుండా ఉండేవన్నారు.

సాగునీరు లేకపోతే వ్యవసాయం చేయడం సాధ్యం కాదు. అదే జరిగితే సంపద సృష్టించడం అసాధ్యం. బీఆర్‌ఎస్ పాలనలో 24 గంటల విద్యుత్‌, అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. తెలంగాణలో సంపద పెరిగింది. సాగునీటి సదుపాయాలు మెరుగయ్యాయి. తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలన తర్వాత తెలంగాణలో వచ్చిన మార్పులు, చేసిన అభివృద్ధి ఏంటనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు’’ అని కేటీఆర్‌ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా పేరిట బ్లాక్మెయిల్ దుకాణం ఓపెన్ చేశారని ఆరోపించారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందన్నారు.

First Published:  5 Nov 2024 5:09 PM IST
Next Story