15 సీట్లు.. బీజేపీ నయా స్కెచ్.!
తెలంగాణలో హంగ్ వచ్చే అవకాశాలున్నాయని ఇటీవల కొన్ని సర్వే సంస్థలు తేల్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ 15 సీట్లపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది.
తెలంగాణలో బీజేపీ ఎలాగూ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఆ పార్టీ వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తోంది. శనివారం రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా రాష్ట్ర నేతలకు ఈ మేరకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. కేవలం 15 సీట్లు గెలిస్తే చాలు చక్రం తిప్పొచ్చని సూచించినట్లు సమాచారం.
పార్టీ వనరులను రాష్ట్రమంతా కాకుండా బలమైన అభ్యర్థులు, గెలిచే అవకాశాలు ఉన్నచోటే ఎక్కువగా వినియోగించాలని రాష్ట్ర నేతలకు అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. 15 స్థానాలు గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటులో కీ రోల్ ప్లే చేయొచ్చనేది బీజేపీ ప్లాన్.
తెలంగాణలో హంగ్ వచ్చే అవకాశాలున్నాయని ఇటీవల కొన్ని సర్వే సంస్థలు తేల్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ 15 సీట్లపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే బీజేపీ నేతలు సైతం ప్రభుత్వ ఏర్పాటులో తమది కీరోల్ ఉండబోతుందని చెప్తున్నారు.