అంతర్జాతీయ నాయకుడిగా ఎదిగిన బండి సంజయ్.. సోషల్ మీడియాలో ఉక్రెయిన్, తుర్క్‌మెనిస్తాన్ ఫాలోవర్లు
జాతీయ స్థాయి నాయకుడిగా మారారంటే మేం అర్థం చేసుకుంటాం. కానీ ఇలా ఏకంగా అంతర్జాతీయ స్థాయి నాయకుడు ఎలా అయ్యాడని డౌటనుమానమా? అయితే ఒక్కసారి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ ట్విట్టర్ అకౌంట్‌ను పరిశీలించండి.
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ ఇప్పుడు అంతర్జాతీయ నాయకుడిగా ఎదిగారు. అదేంటి.. మొన్ననే కరీంనగర్ కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీగా ఎదిగారు. ఇప్పటికీ తెలంగాణ దాటి బయటకు వెళ్లరు. కనీసం పార్లమెంటుకు వెళ్లి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్‌కు నిధులు తెద్దామనే సోయి కూడా లేకుండా.. పాదయాత్ర పేరుతో తెలంగాణలోనే తిరుగుతుంటారు కదా.. అలాంటి వ్యక్తి అంతర్జాతీయ నాయకుడు ఎలా అయ్యారు.
ఏ జాతీయ స్థాయి నాయకుడిగా మారారంటే మేం అర్థం చేసుకుంటాం. కానీ ఇలా ఏకంగా అంతర్జాతీయ స్థాయి నాయకుడు ఎలా అయ్యాడని డౌటనుమానమా? అయితే ఒక్కసారి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ ట్విట్టర్ అకౌంట్‌ను పరిశీలించండి. అదేమీ మామూలు అకౌంట్ కూడా కాదు. బ్లూటిక్ కలిగిన ఒరిజినల్ అకౌంట్. అందులో బండి సంజయ్‌ను ఉజ్బెకిస్తాన్, రష్యా, తుర్క్‌మెనిస్తాన్, ఉక్రెయిన్, పపువా న్యూ గినియా వంటి దేశాలకు చెందిన అభిమానులు ఫాలో అవుతున్నారు. కరీంనగర్ గల్లీల నుంచి ఇటీవలే తెలంగాణలో తిరుగుతున్న సంజయ్‌కి ఆ దేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. నిత్యం సంజయ్ చేసే ట్వీట్లను ఫాలో అవుతూ లైకులు కూడా కొడుతున్నారు.
వాస్తవానికి ఒరిజినల్ ట్విట్టర్ అకౌంట్‌లో దాదాపు 35 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. వాటిలో అత్యధికం ఇలా ఇతర దేశాలకు చెందిన ఫేక్ అకౌంట్లే ఉన్నాయి. కనీసం వారి పేర్లు ఉచ్చరించడం కూడా కష్టంగా ఉన్నాయి. అలాంటి వాళ్లు సంజయ్ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు. ఇదంతా సంజయ్, బీజేపీ టీమ్ సృష్టించిన ఫేక్ అకౌంట్లని నిపుణులు చెబుతున్నారు. వాటిని ఓ ట్విట్టర్ యూజర్ స్క్రీన్ షాట్ తీసి బయటపెట్టారు. ఇప్పటి వరకు ఈ ఫేక్ అకౌంట్లపై బండి సంజయ్ మాత్రం స్పందించలేదు. కానీ, ట్విట్టర్ యూజర్లు మాత్రం సంజయ్ అంతర్జాతీయ నాయకుడు అయిపోయాడంటూ సెటైర్లు వేస్తున్నారు.
Telangana #BJP Chief @bandisanjay_bjp Instagram Followers random list
— Sardar Chandan Singh BRS (@ChandansinghBRS) February 11, 2023
This International leader has followers from
Uzbekistan,
Russia,
Turkmesnistan,
Ukraine,
Papua New Guinea Etc...
Super Bandi garu..
From a Corporator to International level in just 4 years pic.twitter.com/d4TDGfcF9X